Operation Sindoor: త్వరలోనే సైన్యం ఆపరేషన్ సిందూర్ 2.0కి సిద్ధమవ్వాలని. పాకిస్థాన్ బుద్ధి మార్చుకోకపోతే భూగోళంలోనే లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఇంతకీ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరంటే..
రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్‌లో ఉన్న సైనిక పథ్‌పోస్టును శుక్రవారం సందర్శించిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడారు. పర్యవేక్షణ పనులలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆయన దేశీయ భద్రతా పరిస్ధితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
24
ఆపరేషన్ సిందూర్ 2.0పై కీలక వ్యాఖ్యలు
జనరల్ ద్వివేది మాట్లాడుతూ.. త్వరలో 'ఆపరేషన్ సిందూర్ 2.0' నిర్వహించే అవకాశముందని ప్రకటించారు. గతంలో అమలు అయిన ఆపరేషన్ సిందూర్‌కి సంబంధించిన పాఠాలు, వ్యూహాత్మక దశలను బట్టి తదుపరి చర్యలను సన్నాహకంగా చేపట్టబోతున్నట్లు తెలిపారు.
34
పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
ఆర్మీ చీఫ్ స్పష్టం చేసిన ప్రకారం.. ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారిపై భారత్ తగిన విధంగా స్పందిస్తుందని హెచ్చరించారు. "పాకిస్థాన్ భూగోళికంగా తమ స్థానాన్ని ఆపుకునేలా ఉండాలంటే ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేయాలి" అని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తగిన సమయంలో మరింత కఠిన చర్యలు అనుసరించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
గతంలో జరిగిన ఆపరేషన్ సిందూర్‌ను ద్వివేది ఒక చెస్ గేమ్‌తో పోల్చారు. సైన్యం దాయాది దేశంతో చెస్ ఆడిందని అన్నారు. శత్రువు తదుపరి కదలికలు ఏమిటో కూడా ఆ సమయంలో తమకు తెలియదని.. ఈ పరిస్థితిని గ్రేజోన్ అంటారని అన్నారు. అయినప్పటికీ సమయానుకూలంగా స్పందిస్తూ.. ఆ దేశానికి చెక్ పెట్టామని అన్నారు.