UPSC : ఐఏఎస్, ఐపిఎస్ కల ఎలా నిజమయ్యింది..?

Published : Oct 03, 2025, 03:04 PM IST

UPSC : శతాబ్ది ఉత్సవాల్లో బాగంగా యూపిఎస్సి సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది సివిల్ సర్విసెస్ కు సన్నద్దమయ్యేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. అదేంటో తెలుసా? 

PREV
15
యూపిఎస్సి సరికొత్త కార్యక్రమం

UPSC : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్... ఇది దేశంలోనే అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగులను ఎంపికచేసే నియామక సంస్థ. పరిపాలనలో అత్యంత కీలకంగా వ్యవహరించే ఐఏఎస్, ఐపిఎస్ వంటి ఉద్యోగులను ఎంపికచేస్తుంది.. ఇందుకోసం కఠినమైన పరీక్షను, ఇంటర్వ్యూను నిర్వహిస్తుంది. అయితే యూపిఎస్సి ఇంటర్వ్యూ ప్రక్రియ గురించి బయట కథలు కథలుగా చెప్పుకుంటారు... అందులో అడిగే కొన్ని ప్రశ్నలు, అభ్యర్థులు చెప్పే సమాధానాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇలా సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు తమ అనుభవాలను పంచుకునే అవకాశం కల్పిస్తోంది యూపిఎస్సి.

25
యూపిఎస్సి శతాబ్ది ఉత్సవాలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ శతాబ్ది ఉత్సవాలకు సిద్దమవుతోంది... 1926 పాలనాపరంగా అత్యున్నత ఉద్యోగులను నియమించేందుకు బ్రిటీష్ ప్రభుత్వం దీన్ని ఏర్పాటుచేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా దీన్ని అలాగే కొనసాగించారు... కాలక్రమేణా కొన్ని మార్పులు చేశారు. ఇలా యూపిఎస్సి వందేళ్ళ జర్నీ పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది… ''My UPSC Interview - From Dream to Reality'' పేరిట ఓ కాంపిటీషన్ నిర్వహిస్తోంది

35
ఏమిటీ 'మై యూపిఎస్సి ఇంటర్వ్యూ'?

ఎంతో కఠినమైన యూపిఎస్సి రాత పరీక్షలో మంచిమార్కులు సాధించినా ఉత్తమ ర్యాంకు రావాలంటే ఇంటర్వ్యూ చాలా కీలకం. అభ్యర్థుల విషయ పరిజ్ఞానంతో పాటు ఆలోచనా ధోరణి ఎలా ఉంది? పరిపాలనాపరంగా సమర్థవంతంగా వ్యవహరించగలరా? సమస్యలు ఎదురైతే పరిష్కరించగలరా? ప్రజలతో ఎలా ఉంటారు? అనేది ఈ ఇంటర్వ్యూ చేసే బోర్డుసభ్యులు అంచనా వేస్తారు. దీని ఆధారంగానే మార్కులు కేటాయిస్తారు. అయితే ఈ ఇంటర్వ్యూ చాలా ఆసక్తికరంగా సాగుతుంది.

ఇలా యూపిఎస్సి ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు అనుభవాలను ప్రజలకు తెలియజేసే పోటీనే 'మై యూపిఎస్సి ఇంటర్వ్యూ' పోటీ. యూపిఎస్సి ఇంటర్వ్యూలో ఆసక్తికర సంఘటనలు, మరపురాని జ్ఞాపకాలను తెలియజేయవచ్చు. ఇలా తమ సివిల్ సర్వీస్ కలను నిజం చేసుకోవడంలో ఇంటర్వ్యూ పాత్ర ఏమిటి? ఎలా ఎదర్కొన్నది? తెలియజేయవచ్చు.

45
ఎవరు అర్హులు

ప్రస్తుతం సివిల్ సర్వెంట్స్ గా అంటే వివిధ హోదాల్లో పనిచేసే ఐఏఎస్, ఐపిఎస్ వంటి ఉన్నతాధికారులు ఈ 'మై యూపిఎస్సి ఇంటర్వ్యూ' పోటీలో పాల్గొనేందుకు అర్హులు. ఇలాగే ఇప్పటికే సర్వీస్ పూర్తిచేసుకుని రిటైర్ అయినవారు కూడా పాల్గొనవచ్చు. వాళ్ల యూపిఎస్సి ఇంటర్వ్యూ అనుభవాలను ఇంగ్లీష్ లేదా హిందీలో రాయాల్సి ఉంటుంది. 250 నుండి 2000 పదాలలో తమ అనుభవాన్ని పంచుకోవాలి. వీటన్నింటిని యూపిఎస్సి స్క్రీనింగ్ కమిటీ స్క్రూటినీ చేసి పబ్లిష్ చేస్తుంది.

55
'మై యూపిఎస్సి ఇంటర్వ్యూ' ఎప్పట్నుంచి ప్రారంభం...

తమ అనుభవాలను పంచుకోవాలనుకునే అధికారులకు అక్టోబర్ 1, 2025 నుండి డిసెంబర్ 31, 2025 వరకు అవకాశం ఉంటుంది. అంటే వచ్చే మూడునెలల్లో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) ఎప్పుడైనా యూపిఎస్సి ఇంటర్వ్యూ అనుభవాలను పంచుకోవచ్చన్నమాట. అయితే అభ్యర్థులు పంపించే అనుభవాల్లో వేటిని అంగీకరిస్తారు... వేటిని తిరస్కరిస్తారు అనేది స్క్రీనింగ్ కమిటీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories