Yogi Adityanath : లక్కీ గర్ల్స్.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో కాళ్ళు కడిగించుకున్నారుగా..!

Published : Oct 02, 2025, 03:27 PM IST

Yogi Adityanath : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌నాథ్ ఆలయంలో మహానవమి రోజు కన్యా పూజ చేశారు. తొమ్మిది మంది బాలికల పాదాలు కడిగారు… ఇలా ఎందుకు చేశారో తెలుసా?    

PREV
15
చిన్నారుల కాళ్లు కడిగిన సీఎం యోగి

Yogi Adityanath : దేవీ నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా దుర్గామాత ఆరాధనలు జరుగుతున్నాయి… ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్ గోరఖ్‌నాథ్ ఆలయంలో ఒక అద్భుతమైన సంప్రదాయం వెలుగుచూసింది. శారదీయ నవరాత్రుల మహానవమి రోజున స్వయంగా ముఖ్యమంత్రి, గోరక్ష పీఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ సంప్రదాయాన్ని పాటిస్తూ కన్యా పూజ (చిన్నారులను పూజించడం) చేశారు. ఈ సమయంలో ఆయన తొమ్మిది మంది దుర్గా స్వరూప బాలికల పాదాలు కడిగి, తిలకం దిద్ది, భోజనం వడ్డించి మాతృశక్తికి గౌరవం చాటారు.

25
గోరఖ్‌నాథ్ ఆలయంలో సంప్రదాయబద్ధంగా కన్యా పూజ

గోరఖ్‌నాథ్ ఆలయంలోని భోజనశాలలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇత్తడి పళ్లెంలో నీటితో తొమ్మిది మంది బాలికల పాదాలు కడిగారు. దుర్గా సప్తశతి మంత్రోచ్ఛారణల మధ్య ఆయన కన్యలకు తిలకం దిద్ది, పువ్వులు అర్పించి, చున్నీ కప్పి, దక్షిణతో పాటు బహుమతులు ఇచ్చారు. ఈ సమయంలో ఆరు నెలల పాపకు కూడా పూజ చేశారు.

35
సీఎం స్వయంగా ప్రసాదం వడ్డించారు

కన్యా పూజ తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాలికలకు తన చేతులతో భోజనం వడ్డించారు. ఈ సమయంలో ఆయన పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ, ఎవరి పళ్లెంలోనూ ప్రసాదం తక్కువ కాకుండా చూసుకున్నారు. ఆలయ సిబ్బందికి కూడా ప్రత్యేక సూచనలు ఇచ్చారు.

45
హనుమంతుడి రూపంలో ఉన్న బాలుడికి కూడా పూజ

ముఖ్యమంత్రి బాలికలనే కాకుండా హనుమంతుడి రూపంలో వచ్చిన ఒక బాలుడికి కూడా పూజ చేశారు. అతనికి తిలకం దిద్ది, మాల వేసి, అంగవస్త్రం కప్పారు. ఈ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

55
సంప్రదాయం, విశ్వాసాల అద్భుత సంగమం

కన్యా పూజ సందర్భంగా గోరఖ్‌నాథ్ ఆలయ ప్రధాన పూజారి యోగి కమల్‌నాథ్, కాశీ నుంచి వచ్చిన జగద్గురు స్వామి సంతోషాచార్య సతువా బాబాతో పాటు ఇతర సాధువులు హాజరయ్యారు. దీనికి ముందు సీఎం యోగి ఉదయం పూజా కార్యక్రమంలో సిద్ధిధాత్రి అమ్మవారిని శాస్త్రోక్తంగా ఆరాధించారు.

Read more Photos on
click me!

Recommended Stories