ఈవారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు.. పండగ చేసుకునే కంటెంట్ రెడీ, ఏ మూవీ ఎక్కడ చూడాలంటే

Published : Sep 22, 2025, 06:30 AM IST

This Week OTT Releases : ఈవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు వాటి రిలీజ్ డేట్ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. మోహన్ లాల్ హృదయపూర్వం, నారా రోహిత్ సుందరకాండ చిత్రాలతో పాటు మరిన్ని మూవీ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.  

PREV
16
This Week OTT Releases

ఈ వారం ఓటిటీల్లో రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్టు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5తో పాటు ఆపిల్ టీవీ, మనోరమా మ్యాక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో పలు ఆసక్తికరమైన కంటెంట్ స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది.

26
నెట్ ఫ్లిక్స్

ఫ్రెంచ్ లవర్

పారిస్ నేపథ్యంలో నడిచే ఈ రొమాంటిక్ డ్రామాలో ఓ నటుడు, వేట్రెస్ మధ్య సాగే అనుకోని ప్రేమకథను చూపించనుంది. 

రిలీజ్ తేదీ: సెప్టెంబర్ 26

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్

మాంటిస్

దక్షిణ కొరియా యాక్షన్ థ్రిల్లర్ మాంటిస్, కిల్ బోక్సూన్ యూనివర్స్‌లో సాగే కథ. ఇమ్ సి-వాన్, పార్క్ గ్యు-యంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

రిలీజ్ తేదీ: సెప్టెంబర్ 26 

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్

36
జియో హాట్ స్టార్ 

 హృదయపూర్వం

మోహన్‌లాల్ హీరోగా నటించిన హృదయపూర్వం థియేటర్లలో హిట్‌గా నిలిచి, రూ.75 కోట్లకు పైగా వసూలు చేసింది. మలవికా మోహనన్ హీరోయిన్‌గా నటించిన ఈ మలయాళ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఇప్పుడు ఓటిటీలోకి వస్తోంది. 

రిలీజ్ తేదీ: సెప్టెంబర్ 26 

ఎక్కడ చూడాలి: జియోహాట్‌స్టార్

సుందరకాండ

వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ తెలుగు రొమాంటిక్ కామెడీ ఒక నలభై ఏళ్ల వ్యక్తి జీవితంలో ప్రేమ ప్రవేశించిన తర్వాత ఎదురైన మలుపులను చూపిస్తుంది. 

రిలీజ్ తేదీ: సెప్టెంబర్ 27 

ఎక్కడ చూడాలి: జియోహాట్‌స్టార్

46
ఆపిల్ టీవీ

ఆల్ ఆఫ్ యు 

లారా, సైమన్ మధ్య స్నేహం ప్రేమలోకి మారే కథను చూపించే ఈ డ్రామా, ఆపిల్ టీవీలో ప్రసారం కానుంది. 

రిలీజ్ తేదీ: సెప్టెంబర్ 26 

ఎక్కడ చూడాలి: ఆపిల్ టీవీ

స్లో హార్సెస్ సీజన్ 5 (Slow Horses Season 5)

ఎమ్‌ఐ5 టీమ్ రహస్య గూఢచారి కథతో కూడిన ఈ బ్రిటిష్ సిరీస్ కొత్త సీజన్‌తో వస్తోంది. 

రిలీజ్ తేదీ: సెప్టెంబర్ 24 

ఎక్కడ చూడాలి: ఆపిల్ టీవీ

56
మనోరమా మ్యాక్స్  

సర్కీత్ 

ఒకే రోజు జరిగే అనుకోని పరిణామాల చుట్టూ తిరిగే ఈ డ్రామా మనోరమా మ్యాక్స్లో స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. 

రిలీజ్ తేదీ: సెప్టెంబర్ 26 

ఎక్కడ చూడాలి: మనోరమా మ్యాక్స్

66
ప్రైమ్ వీడియో

హోటల్ కాస్టిరా  

హోటల్‌లో పనిచేసే డానియెల్ జీవితం అనూహ్యంగా మారిపోతుంది. ఈ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో విడుదల అవుతుంది.

రిలీజ్ తేదీ: సెప్టెంబర్ 24 

ఎక్కడ చూడాలి: ప్రైమ్ వీడియో

కొకైన్ క్వార్టర్ బ్యాక్ (Cocaine Quarterback)

ఓవెన్ హాన్సన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ  డాక్యుమెంటరీ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. 

రిలీజ్ తేదీ: సెప్టెంబర్ 25 

ఎక్కడ చూడాలి: ప్రైమ్ వీడియో

Read more Photos on
click me!

Recommended Stories