PIB Fact Check: సమోసా, జిలేబీ, చాయ్ బిస్కెట్లపై కేంద్రం హెచ్చరికలు చేసిందా?

Published : Jul 15, 2025, 06:37 PM IST

PIB fact check: సమోసా, జిలేబీ, లడ్డూలు, చాయ్ బిస్కెట్లపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హెచ్చరికలు చేసిందనే వార్తలు వైరల్ గా మారాయి. వాటిని తినొద్దనే ఆదేశాలు నిజంగానే కేంద్రం ఇచ్చిందా? లేదా ఇది ఫేక్ వార్తేనా? పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లో ఏం తేలింది?

PREV
15
సమోసా, జిలేబీ, ఛాయ్ బిస్కెట్ల వార్తలపై అలర్ట్

ఇటీవల కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్ట్‌లలో భారతదేశ ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్‌లు అయిన సమోసా, జిలేబీ, లడ్డూలు, చాయ్ బిస్కెట్ల పై , కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ (MoHFW_INDIA) ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. ఇదే విషయం వైరల్ గా మారింది.

తాజాగా కేంద్రం ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది. ఈ వార్తలన్నీ పూర్తిగా అసత్యమని కేంద్రం స్పష్టం చేసింది. పత్రికా సమాచార కార్యాలయం (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చిచెప్పిన ప్రకారం, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ విధంగా ఎలాంటి బ్యాన్ లేదా స్పెసిఫిక్ హెచ్చరికలు జారీ చేయలేదు.

25
PIB ఫ్యాక్ట్ చెక్ తో ఏం చెప్పింది?

PIB తన అధికారిక ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ ప్రచారాలను ఫేక్ క్లెయిమ్ గా పేర్కొంది. ఇది ఫేక్ న్యూస్ గా గుర్తించింది. సమోసా, జిలేబీ, లడ్డూ వంటి సాంప్రదాయ భారతీయ ఆహారాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఎలాంటి హెచ్చరిక లేదా నిషేధం విధించలేదని PIB తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేసింది.

35
కేంద్ర ఆరోగ్య శాఖ ఎడ్వైజరీ ఉద్దేశం ఏమిటి?

PIB వివరించిన ప్రకారం, ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీ చేసిన సలహా (ఎడ్వైజరీ) వర్క్‌ప్లేస్‌లలో ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలపై దృష్టి పెట్టేలా ప్రజలలో అవగాహన కలిగించేందుకు మాత్రమే ఉంది. ఇందులో ప్రత్యేకించి ఏ ఒక్క ఆహార పదార్థాన్ని పేర్కొనలేదు. అధిక చక్కెరలు, కొవ్వు పదార్థాలపై ప్రజలలో అవగాహన కలిగించి, ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించాలనే ఉద్దేశంతో ఈ సలహా జారీ చేసింది.

45
ఇండియన్ స్ట్రీట్ ఫుడ్‌ ను స్పష్టంగా పేర్కొనలేదు

సలహా భారతీయ స్ట్రీట్ ఫుడ్ కల్చర్‌ను టార్గెట్ చేయడం లేదని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇది ఒక సాధారణ ఆరోగ్య సంబంధిత చర్యగా మాత్రమే చూడాలని మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది. సమోసా, జిలేబీ వంటి వంటకాలకు వ్యతిరేకంగా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.

55
తప్పుడు వార్తలపై హెచ్చరించిన పీఐబీ

పీఐబీ తప్పుడు వార్తల విషయంలో ప్రజలను హెచ్చరించింది. ఆధారరహితమైన, తప్పుడు వార్తలను నమ్మవద్దని, అధికారికంగా వచ్చిన సమాచారాన్ని మాత్రమే చూడాలని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలు ఆరోగ్యంపై ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సూచించింది.

ప్రజలు అధికారిక వెబ్‌సైట్‌లు, ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాల ద్వారా నిజమైన సమాచారం తెలుసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సంబంధిత మార్గదర్శకాలు వచ్చినప్పుడు అవి ప్రజల శ్రేయస్సు కోసమేనని గుర్తుంచుకోవాలి. ఫేక్ న్యూస్‌ను వ్యాపింపజేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories