Shubhanshu Shukla: విజ‌య‌వంతంగా భూమిపైకి తిరిగొచ్చిన శుభాంశు శుక్లా .. కొత్త చ‌రిత్ర

Published : Jul 15, 2025, 03:40 PM IST

Shubhanshu Shukla: అంత‌రిక్షం నుంచి శుభాంశు శుక్లా భూమిపైకి తిరిగొచ్చారు. 41 సంవత్సరాల తర్వాత అంతరిక్షంలోకి ప్రయాణించిన రెండవ భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. 

PREV
16
చ‌రిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా

Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా నేడు భూమికి తిరిగి వ‌చ్చారు. ఆక్సియం 4 మిషన్‌లో పాల్గొన్న వ్యోమగామి శుక్లాతో పాటు మరో ముగ్గురు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల బస తర్వాత భూమిపైకి సుర‌క్షితంగా తిరిగివ‌చ్చారు.

వారి అంతరిక్ష నౌక కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో దిగింది. శుక్లా, కమాండర్ పెగ్గీ విట్సన్, మిషన్ నిపుణులు పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపులను మోసుకెళ్లే డ్రాగన్ 'గ్రేస్' అంతరిక్ష నౌక సోమవారం సాయంత్రం భారత సమయం ప్రకారం 4:45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుండి విడిపోయింది.

26
విజయవంతంగా భూమిపైకి తిరిగొచ్చిన శుభాంశు శుక్లా

2025 జూలై 15 న భారత అంతరిక్ష చరిత్రలో మరో ముఖ్య ఘట్టం చోటు చేసుకుంది. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కేప్టెన్ శుభాంశు శుక్లా, అంతర్జాతీయ అంతరిక్ష స్థానం (ISS) లో 18 రోజుల మిషన్ పూర్తి చేసి విజయవంతంగా భూమిపైకి తిరిగివచ్చారు. ఆయన ప్రయాణం స్పేస్‌ఎక్స్ గ్రేస్ తో ముగిసింది. వీరి ప్ర‌త్యేక క్యాప్స్యూల్ అమెరికాలోని కేలిఫోర్నియా తీరంలోని పసిఫిక్ మహాసముద్రం ల్యాండ్ అయింది.

36
ఫాల్కన్ 9 ద్వారా ప్రారంభమైన తొలి అంతరిక్ష ప్రయాణం

శుభాంశు శుక్లా వారి అంతరిక్ష యాత్ర 2025 జూన్ 25న ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రారంభమైంది. జూన్ 26న, ఆయన ప్రయాణించిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ అంతర్జాతీయ ప‌రిశోధ‌న కేంద్రం (ISS) తో కలిసింది. అక్కడ ఆయన 18 రోజులపాటు పలు శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొన్నారు. ఇది ఆయన మొదటి అంతరిక్ష ప్రయాణం కాగా, Axiom Mission 4 (Ax-4) లో కీలక భాగంగా నిలిచారు.

46
60 కంటే ఎక్కువ ప్రయోగాలు, ISRO కు కీలక డేటా

ISS లో శుభాంశు చేసిన 60 పైగా శాస్త్రీయ ప్రయోగాలు చేశారు. మానసిక ఆరోగ్య ప్రభావం, అంతరిక్షంలో పంటలు పెంచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ ప్రయోగాల్లోని 7 ISRO ప్రయోగాలు కాగా, ఆయన తిరిగి తీసుకొచ్చిన 263 కిలోల శాస్త్రీయ సామాగ్రి, భారత భవిష్యత్ గగనయాన్ మిషన్‌కు బాగా ఉప‌యోగ‌ప‌డ‌నుంది. భారత ప్రభుత్వం ఈ మిషన్‌కు రూ.550 కోట్లు ఖర్చు చేసింది.

56
ప్ర‌ధాని మోడీ అభినంద‌న‌లు

శుభాంశు శుక్లా క్షేమంగా భూమిపైకి వచ్చిన తర్వాత ధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ లో స్పందించారు. "గ్రూప్ కేప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష స్థానం సందర్శించిన మొదటి భారతీయుడు. ఆయన ధైర్యం, అంకితభావం దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తుంది. ఇది గగనయాన్ మిషన్ వైపు మరో ముంద‌డుగు" అని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, “భారత్ అంతరిక్ష రంగంలో మరో శిఖరాన్ని అధిరోహించింది. ఇది దేశ గర్వంగా నిలిచే క్షణం” అని అన్నారు.

66
భూమిపైకి శుభాంశు శుక్లా ఎలా వచ్చారంటే?

భూమి వాతావరణంలోకి ప్రవేశించేందుకు డీ-ఆర్బిట్ బర్న్ ప్రక్రియ చేపట్టారు. ఇది సుమారు 18 నిమిషాల పాటు సాగింది. భూమికి 5.7 కిలోమీటర్ల ఎత్తులో మొదటి పారాచూట్ తెరుచుకోగా, 2 కిలోమీటర్ల వద్ద రెండో పారాచూట్ తెరుచుకుంది. 

చివరగా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు శుభాంశు వ‌చ్చిన ప్ర‌త్యేక క్యాప్స్యూల్ పసిఫిక్ సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇప్పుడు ఆయనతో పాటు మిగతా క్రూ సభ్యులు 7 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories