బెంగళూరులోని ట్రినిటీ రోడ్ సమీపంలో ఓ యువజంట చేసిన హంగామా మాములుగా లేదు. హైవేపై ఓ కారు వేగంగా దూసుకెళ్తుంది. అదే సమయంలో ఓ కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చిన యంగ్ కపుల్ హగ్ చేసుకుంటూ, కిస్ చేస్తూ కనిపించారు. సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. చుట్టూ ఎవరున్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయిన జంట రెచ్చిపోయింది.