Goa AI Policy: గోవా ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ముందడుగు వేస్తూ కొత్త డ్రాఫ్ట్ పాలసీని విడుదల చేసింది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా రాష్ట్రాన్ని టెక్నాలజీ కేంద్రంగా మార్చనున్నారు.
ఈ డ్రాఫ్ట్ పాలసీ ప్రధాన ఉద్దేశ్యం గోవాను టెక్నాలజీ ఆధారిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం. ప్రజలకు టెక్నాలజీ ప్రయోజనాలు అందేలా చేయడం, యువతకు కొత్త నైపుణ్యాలు నేర్పడం ఈ పాలసీ లక్ష్యం. ఫైనాన్స్, టూరిజం, గవర్నెన్స్ వంటి విభాగాల్లో AI వినియోగాన్ని విస్తరించాలనే ప్రణాళిక ఉంది.
25
స్టార్టప్స్, స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి
ఈ పాలసీలో AI స్కిల్లింగ్, స్టార్టప్స్ ప్రోత్సాహం, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. పరిశోధనతో పాటు అభివృద్ధి (R&D) కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై కూడా దృష్టి పెట్టారు. దీని ద్వారా స్థానిక యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
35
గోవా ఏఐ మిషన్ 2027 ప్రణాళిక
“Goa AI Mission 2027” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని యోచిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) అభివృద్ధి, స్థానిక ప్రతిభను ఉపయోగించడం, AI వినియోగంలో భద్రతతో పాటు బాధ్యతను నిర్ధారించడం వంటి అంశాలు ఉన్నాయి.
ఈ పాలసీలో భాగంగా 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీని బదులుగా AI ఆధారిత విద్యా సాధనాలను ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయం యువతపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్నారు.
55
ప్రజల అభిప్రాయాలు, తుది రూపకల్పన
ఈ డ్రాఫ్ట్ పాలసీని ప్రజల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉంచారు. రోహన్ ఖౌంటే ప్రకారం, పరిశ్రమలు, విద్యాసంస్థలతో పాటు ఇతర వర్గాల సూచనలతో ఈ పాలసీని తుది రూపం ఇవ్వనున్నారు. మే 4 నుంచి 15 రోజుల పాటు గోవా ఆన్‌లైన్ పోర్టల్, ఐటీ శాఖ వెబ్‌సైట్‌లో ప్రజలు తమ సూచనలు ఇవ్వవచ్చు