Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్

Published : Dec 10, 2025, 01:40 PM IST

Gleeden App: దేశంలో డేటింగ్ యాప్స్ వినియోగం భారీగా పెరిగింది. అయితే ఇవి పెళ్లి కాని వారికి మాత్ర‌మే అని తెలిసిందే. కానీ వివాహితుల కోసం కోసం కూడా ఒక డేటింగ్ యాప్ ఉంద‌ని తెలుసా.? ఇంత‌కీ ఏంటా యాప్‌, దాని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
గ్లీడెన్ యాప్

పెళ్లికి మ‌న దేశంలో ఎంత ప్రాముఖ్య‌త ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఒకే వివాహం, ఒకే భాగ‌స్వామి అన్న విధానంలో మ‌న ఆలోచ‌న‌లు ఉంటాయి. అయితే వివాహితుల కోసమే ప్ర‌త్యేకంగా రూపొందించిన ఓ యాప్ దూసుకుపోతోంది. ఈ యాప్‌ 30 లక్షల మంది వినియోగదారులను దాటడం ఆశ్చర్యమే కాక పెద్ద చర్చగా మారింది. మహిళా వినియోగదారులు 128% పెరిగి ఇప్పుడు మొత్తం యూజర్లలో 58%గా నిలిచారు.

25
మహిళలే ముందంజ

యాప్‌ రిపోర్ట్‌ ప్రకారం, మహిళలు ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 40% మహిళలు రోజుకు 45 నిమిషాల వరకు యాప్‌లో గడుపుతున్నారు. యాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్న వయసు వర్గం 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నారు. గ్లీడెన్‌ ఇండియా కంట్రీ మేనేజర్ సైబిల్‌ షిడ్డెల్‌ మాట్లాడుతూ, “సంబంధాలపై భారతీయుల ఆలోచనల్లో భారీ మార్పు వస్తోంది. సేఫ్టీ, ప్రైవసీ కోరేవారికి ఈ యాప్‌ ఒక ప్రత్యామ్నాయం అవుతోంది’’ అని అన్నారు.

35
టాప్‌లో బెంగళూరు

యూజ‌ర్ల‌ప‌రంగా చూస్తే బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. యాప్‌లో భారతీయ యూజర్ల శాతం ఇలా ఉంది:

బెంగళూరు – 20%

ముంబై – 19%

కోల్‌కతా – 18%

ఢిల్లీ – 15%

ఇక భోపాల్‌, వడోదర, కొచ్చి వంటి చిన్న పట్టణాల్లో కూడా వినియోగం వేగంగా పెరుగుతోంది.

45
50 లక్షల యూజర్లే టార్గెట్

గ్లీడెన్‌ సంస్థ పెద్ద ఎత్తున విస్తరణను ప్లాన్‌ చేస్తోంది. మరిన్ని నగరాల్లో యాప్‌ సేవలను విస్తరించడం, కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టడం, వచ్చే ఏడాదిలో 50 లక్షల యూజర్ల లక్ష్యం చేరుకోవడం ల‌క్ష్యంగా పెట్టుకుంది.

55
గ్లీడెన్‌ సర్వే

2025లో IPSOS‌తో కలిసి గ్లీడెన్‌ చేసిన నేషనల్ రిలేషన్‌షిప్‌ స్టడీ కొన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించింది.

* స్పందించిన వారిలో 94% తమ సంబంధాల్లో సంతోషంగానే ఉన్న‌ట్లు తెలిపారు.

* 84% శారీరక సంబంధాల్లో సంతృప్తిగా ఉన్నారు.

* అయినప్పటికీ 51% భావోద్వేగంగా దూరమై ఉన్నట్లు భావిస్తున్నారు.

* 71% మంది "చాట్స్‌ డిలీట్‌ చేయడం లేదా దాచడం విశ్వాసభంగమే” అంటున్నారు.

* 41% 'ఓపెన్ రిలేషన్‌షిప్‌' కి ఓపెన్‌గా ఉన్నారు.

* 35% ఇప్పటికే ఓపెన్‌ రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు.

* 55% మంది వచ్చే 10 ఏళ్లలో ఓపెన్ రిలేషన్‌షిప్‌ ప్రధాన ధోరణిగా మారుతుందని భావిస్తున్నారు.

* 33% మంది పని–ప్రైవేట్ జీవితం మధ్య అసమతౌల్యం వల్ల సంబంధాల్లో సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ అధ్యయనం భారతదేశంలో ప్రేమ, నిబద్ధత, వ్యక్తిగత అవసరాలపై కొత్త తరాలు ఎంతగా మారుతున్నాయో స్పష్టంగా చూపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories