Inspiring stories : జోహోలో సెక్యూరిటీ గార్డ్‌గా చేరిన అబ్దుల్ అలీం, డిగ్రీ లేకుండానే స్వయంగా స్కిల్స్ పెంచుకుని అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారాడు. గార్డుగా మొదలై.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సాగిన అలీం ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.
Abdul Alim : సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా !
Inspiring Story : జీవితంలో అవకాశాలు ఎప్పుడు, ఎక్కడ వస్తాయో ఎవరికీ తెలియదు. కానీ వాటిని గుర్తించి పట్టుకోవడమే విజయానికి దారి చూపుతుంది. తమిళనాడుకు చెందిన అబ్దుల్ అలీం అలాంటి అరుదైన ఉదాహరణగా నిలిచాడు... ఒకప్పుడు జోహో కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా డ్యూటీ చేసిన ఈ యువకుడు, తన కృషి, నేర్చుకోవాలనే పట్టుదలతో అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఎంతో మంది యువతకు స్ఫూర్తి నిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రయాణం లింక్డిన్‌లో వైరల్ అయింది. లక్షల మందికి ప్రేరణగా మారింది !
అబ్దుల్ అలీం జీవితంలో ఎదురైన కష్టాలను అధిగమించి, డిగ్రీ లేకుండానే జోహో కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా మారాడు. 2013లో కేవలం వెయ్యి రూపాయలతో ఇంటిని విడిచి వెళ్లిన అలీం, ఆ డబ్బులో రూ.800 ట్రైన్ టికెట్‌కు ఖర్చు చేశాడు. మిగిలిన కొద్దిపాటి మనీతో ఉద్యోగం లేకుండా, రెండు నెలలపాటు వీధుల్లో గడిపాడు. ఈ క్రమంలోనే అతనికి జోహో ఆఫీస్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగం దొరికింది.
26
అబ్దుల్ అలీం కు షిబు అలెక్సిస్ చూపిన మార్గం
జోహోలో సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్న సమయంలో, ఒక సీనియర్ ఉద్యోగి అయిన షిబు అలెక్సిస్ అతన్ని గమనించాడు. ఒకసారి అతనితో మాట్లాడుతున్న సమయంలో “నీ కళ్లలో ఏదో స్పెషల్‌గా కనిపిస్తోంది అలీం” అని అన్నాడు. ఆ సమయంలోనే అతని చదువు గురించి కూడా ఆరా తీశాడు. అయితే, తాను పదో తరగతి వరకే చదువుకున్నాననీ, అయితే కొద్దిగా HTML మాత్రమే తెలుసని అలీం చెప్పాడు. నేర్చుకోవాలనే అతని తపన చూసిన షిబు అలెక్సిస్.. అలీంకు మెంటార్‌గా మారాడు.
36
పగటిపూట సెక్యూరిటీ ఉద్యోగం.. రాత్రిళ్లు ప్రోగ్రామింగ్ నేర్చుకున్న అలీం
ఎనిమిది నెలలపాటు, పగటిపూట సెక్యూరిటీ ఉద్యోగం చేస్తూ, రాత్రివేళ షిబు దగ్గర ప్రోగ్రామింగ్ నేర్చుకునేవాడు అలీం. HTML, బేసిక్ కోడింగ్‌తో ప్రారంభించి.. ప్రావీణ్యం సంపాదించాడు. సొంతంగా ఒక యాప్ రూపొందించాడు. ఆ యాప్ యూజర్ ఇన్‌పుట్‌ని విజువలైజ్ చేసే విధంగా ఉండేది. షిబు అలెక్సిస్ ఆ యాప్‌ని కంపెనీ మేనేజర్‌కి చూపించాడు. అతని ప్రతిభ చూసి మేనేజర్ వెంటనే ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చాడు.
ఇంటర్వ్యూ ముందు అలీం తనకు కాలేజ్ డిగ్రీ లేదని చెప్పగా, జోహో మేనేజర్ స్పందిస్తూ, “జోహోలో డిగ్రీ అవసరం లేదు, ఇక్కడ నీ నైపుణ్యమే ముఖ్యం” అని అన్నారు. దీంతో అలీం ఇంటర్వ్యూ కు వెళ్లాడు. అక్కడ పాస్ అయి డెవలపర్‌గా జోహోలో చేరాడు. అప్పటి నుండి ఇప్పటివరకు ఎనిమిదేళ్లుగా అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా కొనసాగుతున్నాడు.
56
అలీం లింక్డిన్ పోస్ట్ వైరల్
తన లింక్డిన్ పోస్ట్‌లో అలీం తన ప్రయాణం గురించి రాసుకొచ్చాడు. తన పోస్టులో “షిబు అలెక్సిస్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వం నా జీవితాన్ని మార్చింది. అలాగే నాకు అవకాశం ఇచ్చిన జోహో కంపెనీకి ధన్యవాదాలు. నేర్చుకోవడం ఎప్పటికీ ఆలస్యం కాదు.. ఎప్పుడైనా దానిని మొదలుపెట్టవచ్చు” అని పేర్కొన్నాడు. ఇప్పుడు అతని పోస్టు వైరల్ గా మారింది.
అబ్దుల్ అలీం కథ, కేవలం ఒక ఉద్యోగ ప్రయాణం మాత్రమే కాదు.. కష్టసమయంలో కూడా నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన ఉదాహరణగా నిలిచింది. నిజంగా అతని కథ ఎంతో మందికి ప్రేరణను ఇస్తోంది.
66
జోహో కంపెనీ గురించి
చెన్నై కేంద్రంగా ఉన్న జోహో కార్పొరేషన్ 1996లో శ్రీధర్ వేంబు స్థాపించారు. సీఆర్ఎం, ఇమెయిల్, ఫైనాన్స్, వర్క్‌ప్లేస్ సొల్యూషన్స్ వంటి క్లౌడ్ ఆధారిత బిజినెస్ టూల్స్‌ను ప్రపంచవ్యాప్తంగా అందిస్తోంది. స్వదేశీ టెక్ సంస్థగా పేరుగాంచిన జోహో, ఇటీవలి కాలంలో దేశీయ టెక్ అభివృద్ధి కోసం ప్రభుత్వ మంత్రుల మద్దతును పొందడం విశేషం.