School Holidays : ప్రభుత్వం స్కూళ్లకు మరో 10 రోజులు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 7 వరకు దసరా సెలవులు వుండగా, వాటిని మరో 10 రోజులు పొడిగించింది. దీంతో అక్టోబరు 18 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి.
విద్యార్థులకు పండగలాంటి కబరు.. స్కూళ్లకు మరో 10 రోజులు సెలవులు వచ్చాయి. ప్రభుత్వం తాజాగా దసరా సెలవులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటక ప్రభుత్వం ఈవారం మళ్లీ అధికారికంగా స్కూళ్లకు అదనపు సెలవులను ప్రకటించింది. అక్టోబరు 8 నుంచి 18 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. కుల గణన, సామాజిక, విద్యా సర్వే పూర్తి చేసేందుకు ఉపాధ్యాయులకు సమయం ఇవ్వడానికి ఈ సెలవులు ఇచ్చారు.
25
ఇంకా పూర్తికాని సర్వే పనులు
కుల గణన, సామాజిక, విద్యా సర్వేను అక్టోబరు 7 నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, పూర్తి కాలేదు. పలు జిల్లాల్లో పనులు ఆలస్యమవుతున్నాయి. కొప్పల్ జిల్లాలో 97% మాత్రమే పూర్తి అయింది కానీ, దక్షిణ కర్ణాటకలో 60%–63% మాత్రమే పూర్తయింది. ఇలా పలు జిల్లాల్లో సర్వే పూర్తిగా కాలేదు. అందుకే మిగిలిన సర్వే పనులను ముగించడానికి ప్రభుత్వం స్కూళ్లకు అదనపు సెలవులు ప్రకటించింది.
35
కుల గణన, సామాజిక, విద్యా సర్వేలో ఉపాధ్యాయులు
మొత్తం 1,60,000 మంది సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు. వీరిలో 1,20,000 మంది ఉపాధ్యాయులు, 40,000 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. బెంగళూరులో 6,700 మంది ఉపాధ్యాయులు సర్వేలో పాల్గొంటున్నారు. నగరంలోని 46 లక్షల కుటుంబాలను కవర్ చేయడానికి రోజుకు 10–15 ఇళ్ళు సర్వే చేయాల్సిందిగా లక్ష్యం పెట్టారు. ఉపాధ్యాయులు నరక చతుర్దశి వరకు అన్ని సర్వే పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.
రెండో పీయూ (Pre-University) మధ్యంతర పరీక్షలు అక్టోబరు 12 నుంచి ప్రారంభమవుతాయి. అందుకే ఈ పరీక్షల్లో పాల్గొనాల్సిన ఉపాధ్యాయులు సర్వే పనుల నుంచి మినహాయింపులు పొందారు. అలాగే, ఉపాధ్యాయ సంఘం, శాసనమండలి సభ్యుల అభ్యర్థన మేరకు, ప్రభుత్వం స్కూళ్లకు మొత్తం 10 రోజుల అదనపు సెలవులు ప్రకటించింది.
55
ఈ సర్వే లక్ష్యం, ప్రాముఖ్యత ఏమిటి?
ఈ సర్వే చేస్తున్న సమయంలో కొన్ని కారణాల వల్ల ముగ్గురు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ. 20 లక్షల నష్ట పరిహారం ప్రకటించింది. అలాగే, సర్వేలో పాల్గొనకపోయిన లేదా ఆలస్యం చేసిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి సిద్దిరామయ్య స్పష్టంచేశారు.
కుల గణన సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రజల సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులను వివరంగా సేకరించనున్నారు. ఈ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు రూపొందించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని వల్ల ప్రభుత్వ విధానాలు మరింత సదుపయోగంగా మారతాయని తెలిపింది. విద్యార్థుల విద్యా కాలక్రమాన్ని ప్రభావితం చేయకుండా ఉపాధ్యాయులు సర్వే పనులను పూర్తి చేయాలని సీఎం సూచించారు.