క్రియేటర్లకు గోల్డెన్ ఛాన్స్ ! మోదీ నాయకత్వంపై ఏఐ ఫిల్మ్ ఛాలెంజ్ !

Published : Oct 07, 2025, 05:51 PM ISTUpdated : Oct 07, 2025, 06:06 PM IST

Vision Bharat AI Challenge : ప్రధాని నరేంద్ర మోదీ 24 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకొని 'విజన్ భారత్ ఏఐ ఫిల్మ్ ఛాలెంజ్' ప్రారంభమైంది. అక్టోబర్ 26 వరకు ఎంట్రీలు ఉంటాయి. ఈ పోటీలో విజేతలకు ప్రైజ్ మనీతో ప్రత్యేక గుర్తింపు లభించనుంది. వివరాలు ఇవే..

PREV
16
మోదీ 24 ఏళ్ల నాయకత్వాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్త ఏఐ ఫిల్మ్ ఛాలెంజ్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 24 ఏళ్ల నాయకత్వాన్ని పురష్కరించుకుని ‘విజన్ భారత్ ఏఐ ఫిల్మ్ ఛాలెంజ్’ పేరుతో దేశవ్యాప్తంగా అతిపెద్ద ఏఐ ఫిల్మ్ పోటీ ప్రారంభమైంది.

ఈ పోటీ డిజిటల్ క్రియేటర్లు, సినీ కళాకారులకు ఏఐ ఆధారిత 60 సెకన్ల చిన్న వీడియోల ద్వారా ప్రధాని మోదీ దృష్టికోణాన్ని ప్రతిబింబించే అవకాశం కల్పిస్తుంది. ఇందులో పాల్గొనలనుకునే వారు ఆయన జీవితం, నాయకత్వం, తత్వం, లేదా విధానాల ప్రభావం వంటి అంశాలపై వీడియోలు రూపొందించవచ్చు. ఈ పోటీలో గెలుపొందిన వారికి ప్రైజ్ మనీతో పాటు ప్రత్యేక గుర్తింపు కూడా లభించనుంది.

26
60 సెకన్ల ఏఐ వీడియోలతో పోటీ.. అక్టోబర్ 26 చివరి తేదీ

విజన్ భారత్ ఏఐ ఫిల్మ్ ఛాలెంజ్ పోటీకి ఎంట్రీలు 2025 అక్టోబర్ 26 వరకు స్వీకరించనున్నారు. వీడియోలు పూర్తిగా ఏఐ ఆధారితంగా ఉండాలి. ఉత్తమ చిత్రాలకు జాతీయస్థాయి గుర్తింపును పొందడంతో పాటు ప్రత్యేక బహుమతులు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయి.

టాప్ లో నిలిచిన షార్ట్ మీడియోలను ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. జ్యూరీలో సినీ దర్శకులు, కళాకారులు, డిజిటల్ ఇన్నోవేషన్ నిపుణులు, ఏఐ టెక్నాలజీ నిపుణులు ఉంటారు.

36
మోదీ జీవితం నుండి విధానాల వరకు.. నాలుగు ప్రధాన విభాగాలల్లో వీడియోలు

‘విజన్ భారత్ ఏఐ ఛాలెంజ్’లో మొత్తం నాలుగు విభాగాలు ఉన్నాయి:

  1. Life (జీవితం): నరేంద్ర మోదీ జీవితం అంటే బాల్యం నుంచి ప్రధానమంత్రిగా ఎదిగిన జీవన ప్రయాణాన్ని చూపించడం.
  2. Action (చర్యలు): కోవిడ్ సమయంలో నాయకత్వం, అంతర్జాతీయ దౌత్యం, విధానాల అమలు వంటి నిర్ణయాత్మక చర్యలను చూపించవచ్చు.
  3. Philosophy (తత్వం): వికసిత్ భారత్ లక్ష్యం కోసం మోదీ ఆలోచనలు, దృష్టిని ప్రతిబింబించే వీడియోలు.
  4. Policies (విధానాలు): జనధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి మార్పు తీసుకువచ్చిన పథకాలను గురించి కూడా వీడియోలు చేయవచ్చు.
46
విజన్ భారత్ ఏఐ ఫిల్మ్ ఛాలెంజ్ లో నాలుగు రౌండ్ల పోటీ

విజన్ భారత్ ఏఐ ఫిల్మ్ ఛాలెంజ్ పోటీ నాలుగు రౌండ్లుగా ఉంటుంది:

• రౌండ్ 1: 60 సెకన్ల ఏఐ వీడియో. (ఎంట్రీకి చివరి తేదీ – అక్టోబర్ 26, 2025)

• రౌండ్ 2: టాప్ 500 క్రియేటర్లు ఎంపిక. 2–3 నిమిషాల ఏఐ వీడియో తయారు చేయాలి. (తేదీ – నవంబర్ 15, 2025)

• రౌండ్ 3: దేశంలోని టాప్ 100 ఏఐ క్రియేటర్లు ఎంపిక. (ఫలితాలు – నవంబర్ 30, 2025)

• రౌండ్ 4: ఎఐ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్ ఫైనల్. టాప్ 20 ఫిల్మ్‌లు జ్యూరీ ప్యానల్ ముందు ప్రదర్శిస్తారు. (డిసెంబర్ 2025)

పోటీ విజేతలకు ఆర్థిక బహుమతులు, సర్టిఫికేట్లు, జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తాయి.

56
విజన్ భారత్ ఏఐ ఫిల్మ్ ఛాలెంజ్ పాల్గొనేవారి అర్హతలు, సాంకేతిక నిబంధనలు ఏంటి?
  • విజన్ భారత్ ఏఐ ఫిల్మ్ ఛాలెంజ్ పోటీలో భారత పౌరులు అందరూ పాల్గొనవచ్చు. కనీస వయస్సు 18 సంవత్సరాలు. వ్యక్తిగతంగా పాల్గొనాలి.
  • వీడియోలు HD (720p) MP4 ఫార్మాట్‌లో ఉండాలి. ఏ భారతీయ భాషలోనైనా తయారు చేయవచ్చు, అయితే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తప్పనిసరిగా ఉండాలి.
  • పాల్గొనేవారు గూగుల్ VEO 3, OpenAI Sora, Runway Gen-3, Kling AI వంటి ఏఐ టూల్స్ ఉపయోగించవచ్చు.
  • అంగీకరించని కంటెంట్: ద్వేష ప్రసంగం, రాజకీయ లక్ష్యసాధన, తప్పుడు సమాచారము, అసభ్య కంటెంట్, భారతీయ విలువలకు విరుద్ధమైన అంశాలు ఉండకూడదు.
66
క్రియేటర్లకు ప్రత్యేక అవకాశాలు.. జాతీయ స్థాయి గుర్తింపు

ఎంపికైన క్రియేటర్లకు AI Creator Fellowship, జాతీయ మీడియా గుర్తింపు, పాలసీ మేకర్లతో చర్చలు, భవిష్యత్ సహకార ప్రాజెక్టులు వంటి అవకాశాలు కల్పించనున్నారు. ఇది కేవలం పోటీ మాత్రమే కాదు భారత క్రియేటివ్ శక్తిని ప్రపంచానికి చూపించే ఒక ఉద్యమం. 

ఏఐ ఆధారిత కథనం ద్వారా భారత కాలాతీత వారసత్వాన్ని, ఆధునిక సాంకేతిక భవిష్యత్తును ప్రతిబింబించే వేదికగా ఇది నిలవనుందని అధికారులు తెలిపారు. ‘విజన్ భారత్ ఏఐ ఫిల్మ్ ఛాలెంజ్’ మోదీ నాయకత్వాన్ని మాత్రమే కాకుండా భారత యువతలోని సృజనాత్మక ఆలోచనలను వెలికితీసే వేదికగా నిలుస్తోంది. అక్టోబర్ 26 లోపు నమోదు చేసుకొని, మీ ఏఐ ఫిల్మ్‌తో చరిత్ర సృష్టించండి మరి !

Read more Photos on
click me!

Recommended Stories