మోదీ క్వాంటం ఏఐలో ఇన్వెస్ట్‌ చేయ‌మ‌న్నారా.? మీకూ ఈ వీడియో వ‌చ్చిందా.? అస‌లు నిజం ఏంటంటే..

Published : Aug 16, 2025, 04:15 PM IST

Viral Video: సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన త‌ర్వాత ప్ర‌తీ రోజూ వంద‌లాది వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని నిజ‌మైన‌వి ఉంటే మ‌రికొన్ని న‌కిలీ వీడియోలు ఉంటున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫేక్ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. 

PREV
15
మోదీ పేరుతో వీడియో

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పేరుతో నెట్టింట ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 'QuantumAI' అనే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో పూర్తిగా ఫేక్ అని కేంద్ర సమాచార విభాగం (PIB) స్పష్టం చేసింది. ఈ వీడియో డిజిటల్‌గా మార్చార‌ని దానిని నమ్మవద్దని హెచ్చరించింది.

25
PIB ఫాక్ట్ చెక్ క్లారిటీ

ఆగస్టు 14న PIB ఫాక్ట్ చెక్ యూనిట్ తెలిపిన ప్రకారం, మోదీ ప్రసంగాన్ని మార్పులు చేసి ‘QuantumAI’లో రూ.22,000 పెట్టుబడి పెట్టాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నట్లుగా చూపించే వీడియో అసత్యం అని తెలిపారు. ప్రభుత్వం పేరుతో ఇలాంటి స్కీమ్ ఏదీ లేదని స్పష్టంగా తెలిపింది.

35
కొత్త ట్రిక్

PIB హెచ్చరించినట్లు, ప్రముఖ నాయకుల పేర్లు, ముఖాలు ఉపయోగించి పెట్టుబడి స్కీమ్‌లను నకిలీగా చూపించడం ఇప్పుడు సాధారణంగా మారింది. AI ఆధారిత ఎడిటింగ్ టూల్స్‌తో వీడియోలను డిజిటల్‌గా మార్చి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.

45
జాగ్రత్తగా ఉండాలి

ఇలాంటి వీడియోలు, లింకులు, ప్రకటనలు చూసినప్పుడు వాటిలో పెట్టుబడి పెట్టకూడదు. “ఇది పూర్తిగా డిజిటల్‌గా మార్చిన నకిలీ వీడియో. ప్రజలు మోసపోవద్దు” అని పీఐబీ తెలిపింది. ప్రధాని మోదీ పేరుతో, QuantumAI లేదా ఏ ఇతర ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ ప్రభుత్వం మంజూరు చేయలేదు. కాబట్టి ఇలాంటి ప్రకటనలు నిజమని నమ్మకూడదు, వాటిని షేర్ చేయకూడదు.

55
అనుమానాస్పద కంటెంట్ ఎలా రిపోర్ట్ చేయాలి.?

ఇలాంటి మోసపూరిత కంటెంట్‌ను చూసిన వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయాలి. షేర్ చేస్తే మరింత మంది మోసపోవచ్చు కాబట్టి వీడియోలను ఆపివేయడం, రిపోర్ట్ చేయడం మాత్రమే సరైన మార్గం.

Read more Photos on
click me!

Recommended Stories