విమానానికి "ఎంత మైలేజ్ ఇస్తుంది?" అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వాలంటే, గాల్లో ప్రయాణించే విధానం, ఇంధన వినియోగం, వేగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మామూలుగా మనం చూస్తున్న రోడ్ వాహనాల మాదిరిగా విమానాల మైలేజ్ లెక్కించటం కష్టం. ఇది కాస్త భిన్నంగా ఉంటుంది.
ఉదాహరణకు, బోయింగ్ 737 అనే జెట్ విమానాన్ని తీసుకుంటే, ఇది ఒక నిమిషానికి ఒక్కో ఇంజన్ సుమారు 20 లీటర్ల జెట్ ఇంధనంను ఖర్చు చేస్తుంది. రెండు ఇంజిన్లు కలిపితే నిమిషానికి 40 లీటర్లు. అర్థం చేసుకోవాలంటే, గంటకు ఇది సుమారుగా 2400 లీటర్ల ఇంధనాన్ని ఖర్చు చేస్తుంది.
ఈ విమానం ఒక గంటలో సుమారుగా 900 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే, ప్రతి కిలోమీటరుకు సుమారుగా 2.6 లీటర్లు ఖర్చవుతుందన్నమాట. దీని ప్రకారం, ఒక్క లీటరు ఇంధనంతో ఈ విమానం మొత్తం 384 మీటర్లు (0.384 కిలోమీటర్లు) మాత్రమే ప్రయాణిస్తుంది.