Dharmasthala దారుణాలపై కేరళలో కేసు... అసలేం జరిగిందంటే...

Published : Jul 25, 2025, 01:02 PM ISTUpdated : Jul 25, 2025, 01:05 PM IST

కర్ణాటకలోని ప్రముఖ దేవాలయ పట్టణం ధర్మస్థలలో దారుణాలు జరిగినట్లు వెలువడుతున్న కథనాలు ఇప్పటికే తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. 

PREV
15
ధర్మస్థల కేసులో మరో మలుపు

Dharmasthala Case : కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ఎప్పుడూ భక్తి సమాచారంతో వార్తల్లో నిలిచేది... కానీ ఇప్పుడు క్రైమ్ న్యూస్ లో ప్రధానంగా వినిపిస్తోంది. ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న మంజునాథ ఆలయ పరిసరాల్లో అపవిత్రమైన పనులు జరిగాయని... వందలాదిమంది అమ్మాయిలు దారుణ హత్యకు గురయ్యారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఓ పారిశుద్ద్య కార్మికుడి బైటపెట్టిన విషయాలు ఒళ్ళు గగురుపొడిచేలా ఉన్నాయి.

ఇప్పటికే ఈ ధర్మస్థల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ధర్మస్థల దారుణాల్లో కేరళ బాదితులు కూడా చేరారు. 2018లో ధర్మస్థల సమీపంలో జరిగిన ఒక మరణాన్ని ఇదే విధంగా దాచిపెట్టారని కేరళకు చెందిన ఒక కుటుంబం ఆరోపించింది.

కన్నూరుకు చెందిన అనీష్ జాయ్ తన తండ్రి కె.జె. జాయ్ మరణంపై దర్యాప్తు చేయాలని కోరుతూ తలిపరంబ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రి మరణాన్ని కర్ణాటక పోలీసులు రోడ్డు ప్రమాదంగా నమోదు చేశారు... కానీ ధర్మస్థలలోని తమ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నంలో ఆయనను హత్య చేశారని అనీష్ ఆరోపించారు.

ధర్మస్థలలోని కొందరు వ్యక్తులు తన తండ్రిని ఆస్తి విషయంలో పదే పదే బెదిరించేవారని అనీష్ జాయ్ ఆరోపించారు. "తన తండ్రి యాక్సిడెంట్ లో మరణించినట్లు పోలీసులు నిర్దారించారు... రెండు రోజుల్లోనే ఈ ప్రమాదానికి కారణమంటూ ఓ వాహనాన్ని కనుగొన్నారు... కానీ అది గుర్తు తెలియని వాహనమని చెప్పి కేసును ముగించారు. కేసును ముందుకు తీసుకెళ్లవద్దని.. దీనివల్ల ప్రాణానికి ప్రమాదం ఉందని పోలీసులే బెదిరించారు. అందుకే నేను కేరళకు వెళ్ళిపోయాను" అని అనీష్ వెల్లడించారు.

25
అసలు ఏం జరిగింది?

కేరళకు చెందిన అనీష్ జాయ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కె.జె. జాయ్ ఏప్రిల్ 5, 2018న కర్ణాటకలో మరణించారు. మూడుబిదిరే పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ ప్రమాదంలో ఆయన మరణించారు. ఇది సాధారణ ప్రమాదం కాదని అనుమానం ఉండటంతో కుటుంబసభ్యులు మూడుబిదిరే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది యాక్సిడెంట్ కేసుగా పేర్కొని ఢీకొట్టిన వ్యక్తిని, వాహనాన్ని రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్‌లో ఉంచి తర్వాత విడుదల చేశారని అనీష్ అంటున్నారు. ఇక్కడి ప్రముఖ వ్యక్తులు దీని వెనుక ఉన్నారని... కాబట్టి ఈ కేసును ఇక్కడితో వదిలేయాలని అనాడు మూడుబిదిరె ఎస్ఐ తనతో చెప్పారని అనీష్‌ వెల్లడించారు. కేసు విచారణను కొనసాగిస్తే నీ ప్రాణానికి ప్రమాదమని ఎస్ఐ చెప్పినట్లు అనీష్ తెలిపారు.

అనీష్ తాత కర్ణాటకకు వలస వెళ్లి 45 ఎకరాల భూమిని సంపాదించాడు. వారు రబ్బరు, జీడిపప్పు పంటలు పండిస్తూ జీవనం సాగించేవారు. ఈ ప్రదేశం ధర్మస్థల నుండి కేవలం నాలుగు కి.మీ. దూరంలో ఉంది. అయితే కొందరు అనీష్ కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారట. ఉచితంగా తమ భూమిని ఇవ్వాలని బెదిరించారని అనీష్ తెలిపారు.

35
23 ఎకరాల స్థలం కేవలం రూ.18 లక్షలకు అమ్మకం

బెదిరింపులక భయపడకుండా కె.జె. జాయ్ అక్కడ ఒక హోటల్ ప్రారంభించారు. ఈ సమయంలో ఓ వ్యక్తి తమను సంప్రదించి ఈ స్థలాన్ని అమ్మాలని కోరినట్లు అనీష్ చెబుతున్నారు. చివరికి మా నుండి బలవంతంగా స్థలాన్ని కొనుగోలుచేశారని... 23 ఎకరాల భూమిని కేవలం 18 లక్షలకు కొనుగోలు చేశారని తెలిపారు. దీంతో చేసేదేమిలేక కుటుంబమంతా కేరళకు వెళ్ళిపోయామని...తన తండ్రి మాత్రం హోటల్ నడుపుతూ అక్కడే ఉండిపోయారని అనీష్ జాయ్ చెప్పారు.

ఈ సమయంలోనే తన తండ్రిపై మిగిలిన స్థలాన్ని కూడా అమ్మమని ఒత్తిడి చేశారని... అందుకు నాన్న ఒప్పుకోలేదని అనీష్ తెలిపారు. బ్యాంకు నుండి ఆ భూమిపై ఋణం తీసుకోవడానికి ప్రయత్నించారు... కానీ దీన్ని అక్కడున్నవారు అడ్డుకున్నారని తెలిపారు. ఋణం కోసం తిరుగుతుండగానే తండ్రి బైక్ ప్రమాదంలో మరణించాడని అనీష్ వెల్లడించాడు.,

ధర్మస్థల గురించి వెలువడుతున్న సమాచారమంతా నిజమేనని అనీష్ అంటున్నారు. తన తండ్రి మరణం ద్వారా తనకు ఇది అర్థమైందని అన్నారు. దాదాపు వంద మందిని చంపి ఖననం చేశారని వెల్లడైన తర్వాత అనీష్ ధర్మస్థల వెళ్లి మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తలిపరంబ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి, తన ప్రాణానికి ముప్పు ఉందని చెప్పారు.

45
పద్మలత కేసు

ఇక 1986లో ధర్మస్థల బోల్యారు గ్రామానికి చెందిన కళాశాల విద్యార్థిని పద్మలత మరణం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఆమె అదృశ్యమైంది. 56 రోజుల తర్వాత నేత్రావతి నదిలో ఆమె మృతదేహం చేతులు, కాళ్లు కట్టివేయబడిన స్థితిలో లభ్యమైంది. కానీ ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు. చివరికి ఈ కేసును క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) నిందితులను గుర్తించలేకపోయామని కేసును ముగించింది. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్రంలో చర్చ మొదలైంది.

పద్మలత సోదరి చంద్రావతి తన సోదరిపై అత్యాచారం, హత్య జరిగిందని చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ధర్మస్థల శవాల ఖననం కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) హత్య రికార్డులను మళ్ళీ తెరవాలని కోరింది.

చంద్రావతి తెలిపిన వివరాల ప్రకారం... పద్మలత డిసెంబర్ 22, 1986న కళాశాల కార్యక్రమానికి వెళ్లి తిరిగి రాలేదు. మొదట పోలీసులు మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేయడంలో జాప్యం చేసినప్పటికీ, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడైన ఆమె తండ్రి చివరికి చర్య తీసుకోవాలని ఒత్తిడి చేశారు. వారాల తర్వాత ఆమె ఇంటి సమీపంలో మృతదేహం లభ్యమైంది… మృతదేహంపై ఉన్న బట్టలు, చేతి గడియారం ద్వారా పద్మలతగా గుర్తించారు. ఈ మరణానికి కారణం ఏమిటి, నిందితులు ఎవరు అనేది ఇప్పటికీ తెలియరాలేదు.

55
ధర్మస్థలలో దారుణాలు

ధర్మస్థలలో భయం, నిశ్శబ్ద వాతావరణం ఉందని రెండు కుటుంబాలు చెబుతున్నాయి… అక్కడ పోలీసులు, రాజకీయ ప్రభావం చాలా కాలంగా న్యాయాన్ని అడ్డుకుంటున్నాయని వారు అంటున్నారు. శవాల ఖననం ఆరోపణల దర్యాప్తు కోసం ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైనందున చాలా కాలంగా మౌనంగా ఉండటంతో దాగిన దారుణ  కథల బయటకు వస్తాయని ఆశిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories