DA Hike: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పండగాలంటి వార్త చెప్పింది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న డీఏ పెంపునకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దసరా, దీపావళి పండుగల ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషకరమైన వార్త వచ్చింది. కేంద్ర మంత్రివర్గం తాజాగా డియర్‌నెస్ అలవెన్స్ (కరవు భత్యం) 3 శాతం పెంచింది. ఈ పెంపు జూలై 1, 2025 నుంచి అమల్లోకి రానుంది.
25
ఎవరు లబ్ధి పొందనున్నారు.?
ఈ నిర్ణయం వల్ల దాదాపు 1.15 కోట్లు కేంద్ర ఉద్యోగులు, పెన్షన్‌దారులు లాభం పొందనున్నారు. ఇందులో 48 లక్షల ఉద్యోగులు, 68 లక్షల పెన్షన్‌దారులు ఉన్నారు. ఇప్పటివరకు 55% ఉన్న డీఏ, ఇప్పుడు 58%కి పెరిగింది.
35
గతంలో ఎప్పుడు పెరిగింది?
ఇంతకుముందు ఈ ఏడాది జనవరి 1, 2025 నుంచి డీఏ, డీఆర్ (Dearness Relief) 2 శాతం పెరిగింది. దాంతో 53% నుంచి 55%కి చేరింది. ఇప్పుడు మరోసారి 3 శాతం పెంపు చేయడంతో మొత్తం 58% అయ్యింది.
కేంద్ర ఉద్యోగుల జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల బకాయిలు అక్టోబర్ జీతంలో చెల్లించనున్నారు. దీపావళి పండుగకు ముందు ఉద్యోగులకు ఇది పెద్ద ఊరట కానుంది.
55
డీఏ, డీఆర్ ఎందుకు చెల్లిస్తారు.?
డీఏ (ఉద్యోగులకోసం), డీఆర్ (పెన్షన్‌దారులకోసం) జీవన ఖర్చులు, ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి రక్షించేందుకు ఇస్తారు. ఏడాదికి రెండు సార్లు – జనవరి, జూలైలో భత్యం సవరణ చేస్తారు. ఈసారి తీసుకున్న నిర్ణయం 7వ వేతన కమిషన్ సిఫారసుల ప్రకారం చివరి పెంపుగా భావిస్తున్నారు.