CBSE Class 10 official result: సీబీఎస్ఈ బోర్డు కీలక ప్రకటన

Published : May 04, 2025, 05:47 PM ISTUpdated : May 04, 2025, 05:52 PM IST

CBSE Class 10 official result date: సీబీఎస్ఈ 2025 ఫలితాలపై తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. మే 6, 2025న 11 గంటలకు 10వ తరగతి ఫలితాలు విడుదల అవుతాయని పేర్కొంటూ వచ్చిన నకిలీ లేఖపై CBSE అధికారికంగా స్పందించింది.  

PREV
15
CBSE Class 10 official result: సీబీఎస్ఈ బోర్డు కీలక ప్రకటన

CBSE Class 10 official result date: సీబీఎస్ఈ 10వ త‌రగ‌తి ఫలితాలు 2025  కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదురుచూస్తుండగా ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మే 6, 2025 ఉదయం 11 గంటలకు సీబీఎస్ఈ 10వ తరగతి  ఫలితాలు విడుదల అవుతాయని చెబుతూ  ఒక నకిలీ అధికారిక లేఖ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే సీబీఎస్ఈ బోర్డు స్పందించింది. 

25

CBSE official result పై ఫేక్ లెటర్ కలకలం

CBSE Class 10 official result పై ఫేక్ లెటర్ వైరల్ గా మారింది. మే 2 తేదీతో ఉన్న ఈ నకిలీ లేఖలో ఫలితాల విడుదల తేదీ, మార్క్ షీట్ లో కనిపించే వివరాలు, ఫలితాలు ఎలా చూసుకోవాలో వివరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది వేలాది మందికి షేర్ అయింది. 

35

CBSE అధికారిక స్పందనలో ఏం చెప్పంది? 

సోష‌ల్ మీడియాలో సీబీఎస్ఈ 10త త‌ర‌గ‌తి ఫ‌లితాల‌పై వైర‌ల్ గా మారిన ఫేక్ లెట‌ర్ పై CBSE బోర్డు స్పందిస్తూ.. "క్లాస్ 10, 12 ఫలితాలపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దయచేసి తప్పుడు వార్తలు నమ్మవద్దు. ఎప్పుడైనా ఫలితాలు విడుదలకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి" అని, అధికారిక వెబ్‌సైట్:cbse.gov.in, https://cbse.gov.in వివ‌రాలు అందించింది.

45

సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఎంతమంది రాశారు? 

కాగా, సీబీఎస్ ఈ బోర్డు ప‌రీక్ష‌ల రాసిన విద్యార్థుల వివ‌రాలు గ‌మ‌నిస్తే.. 10వ తరగతి విద్యార్థులు 24.12 లక్షల మంది ఉన్నారు. 12వ తరగతి విద్యార్థులు 17.88 లక్షల మంది ఉన్నారు. మొత్తంగా సీబీఎస్ఈ ఫ‌లితాల కోసం మొత్తం 42 లక్షలకు పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. వీరంద‌రూ  7,842 ప‌రీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ రాశారు. 

55

CBSE official result ఎప్పుడు?

CBSE Class 10 official result మే 6న అనేది ఫేక్ న్యూస్. సీబీఎస్ఈ  ఫలితాలు ఎప్పుడు అనే దానిపై బోర్డు ఇప్పటివరకు ఫలితాల తేదీపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, గత సంవత్సరాల చరిత్రను బట్టి చూస్తే ఫలితాలు మే రెండో వారంలో వచ్చే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories