Travel Guide : తెల్లని ఇసుక, రంగురంగుల పగడపు దిబ్బలు.. ఆసియాలోనే అందమైన బీచ్ మన దక్షిణాదిదే.. ఈ ప్రాంతం భూతల స్వర్గమే

Published : Jan 26, 2026, 05:32 PM IST

Andaman Nicobar Tour : అండమాన్ నికోబార్ దీవుల పర్యటన జీవితంలో మరపురాని అనుభూతిని ఇస్తుంది. ఈ దీవుల చరిత్ర, ప్రముఖ బీచ్ లు, ఇతర పర్యాటక ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
112
అండమాన్ నికోబార్ ట్రావెల్ గైడ్

అండమాన్ నికోబార్... బంగాళాఖాతంలో అక్కడక్కడా విసిరివేయబడినట్లు ఉండే దీవుల సముదాయం. చుట్టూ సముద్ర నీరు, మధ్యలో భూభాగం... ఇలా మొత్తం 836 దీవులు ఉంటాయి... వీటిలో కేవలం 31 మాత్రమే నివాసానికి అనువైనవి. అందమైన సముద్ర తీరాలు, పచ్చని అడవులు, అరుదైన జీవసంపద కలిగిన అండమాన్ నికోబార్ దీవుల సందర్శన సరికొత్త అనుభూతిని ఇస్తుంది. భారతీయులు మరీముఖ్యంగా దక్షిణాదివారు తప్పకుండా చూడాల్సిన ప్రకృతి రమణీయ ప్రదేశం అండమాన్ నికోబార్ దీవులు.

212
అండమాన్ నికోబార్ చరిత్ర

అండమానీస్, నికోబారీస్ తెగలు వేలాది సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటుంది. ఇంకా అనేక ఆటవిక తెగలు ఈ దీవుల్లో నివసిస్తున్నారు... వీరు ఇతర ప్రజలతో కలిసేందుకు ఇష్టపడరు. అందుకే వీరి సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడేందుకు ప్రభుత్వం కొన్ని దీవుల్లోకి పర్యాటకులను అనుమతించరు. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే ఈ దీవుల్లో ఇప్పటికీ నరమాంస భక్షకులు ఉన్నారని ప్రచారం ఉంది.

ఒకప్పుడు పూర్తిగా ఆటవిక తెగలకే నివాసమైన అండమాన్ నికోబార్ దీవులను 11వ శతాబ్దంలో చోళ రాజవంశం స్వాధీనం చేసుకుంది. చుట్టు సముద్రజలాలు కలిగిన ఈ ప్రాంతాన్ని నావికా స్థావరంగా ఉపయోగించుకుంది. ఇలా మెళ్లిగా దీవుల్లో జనసంచారం పెరిగింది... 1789 లో బ్రిటీష్ వారు ఇక్కడ ఓ స్థావరం ఏర్పాటుచేసుకున్నారు. 1858 లో అండమాన్ దీవుల్లో సెల్యూలార్ జైలు ఏర్పాటుచేశారు.

రెండవ ప్రపంచయుద్దం సమయంలో ఈ అండమాన్ నికోబార్ దీవులను జపాన్ ఆక్రమించుకుంది. తర్వాత 1943 లో ఇండియన్ నేషనల్ ఆర్మీ అధినేత సుభాష్ చంద్రబోస్ కు దీన్ని అప్పగించింది. 1947 లొ స్వాతంత్య్రం తర్వాత ఇండియాలో భాగమయ్యింది.... 1956 లో ఈ అండమాన్ నికోబార్ దీవులను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు.

ప్రస్తుతం అండమాన్ ఆండ్ నికోబార్ దీవులు భారత పర్యాటక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాదు భారత రక్షణా వ్యవస్థలో కూడా వ్యూహాత్మకంగా మారింది. ఈ దీవుల్లో అనేక సందర్శనీయ ప్రదేశాలున్నాయి... వాటిగురించి తెలుసుకుందాం.

312
అండమాన్ నికోబార్ దీవుల్లో సందర్శనీయ ప్రదేశాలు

పోర్ట్ బ్లెయిర్ :

ఇది అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరం. ఇక్కడే ఒకప్పటి సెల్యూలార్ జైలు, మెరైన్ మ్యూజియం ఉన్నాయి. అలాగే ఇక్కడ వీధుల్లో షాపింగ్ ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. భారతీయ చరిత్ర, స్థానిక సంస్కృతికి నిలయం ఈ పోర్ట్ బ్లెయిర్. ఈ చారిత్రక నగరాన్ని సందర్శించడం చాలా ప్రత్యేకమైనది. 

412
హావ్ లాక్ ద్వీపం (స్వరాజ్ ద్వీపం)

1. రాధానగర్ బీచ్ :

హావ్ లాక్ ద్వీపంను భూతల స్వర్గంగా చెబుతుంటారు. ఇక్కడి తెల్లని ఇసుక, స్వచ్చమైన నీటితో కూడిన బీచ్ లు పర్యాటకులను కట్టిపడేస్లాయి. ఇక్కడే ఆసియాలోనే అత్యుత్తమ రాధానగర్ బీచ్ ఉంది. సాయంత్రం సమయంలో ఈ సముద్ర తీరంలో ఇసుకపై కూర్చుని సూర్యాస్తమయం చూడటం అద్భుతంగా ఉంటుంది.

2. ఎలిఫెంట్ బీచ్ :

ఇదికూడా తెల్లని ఇసుక, నీలిరంగు నీటితో అద్భుతంగా ఉంటుంది. ఈ బీచ్ లోని రంగురంగుల పగడపు దిబ్బలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. సముద్రపు జలాలు కాలిని తగులుతూ వెనక్కి వెళుతుండగా ఆ తెల్లని ఇసుకలో నడవడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఇక స్కూబా డైవింగ్, పారా సైకిలింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ను కూడా ఎంజాయ్ చేయవచ్చు.

3. కాలాపత్తర్ బీచ్ :

కాలాపత్తర్ అంటే హిందీలో నల్లని రాళ్లు అని అర్థం. అండమార్ ఆండ్ నికోబార్ దీవుల్లోని తెల్లని ఇసుకలో నల్లటి రాళ్లతో కూడిన బీచ్ ఇది. తీరం పొడవునా నల్లని బండరాళ్లు ఈ సముద్ర తీరానికి మరిన్ని అందాలను అద్దాయి. ఇక్కడ సూర్యోదయం అద్భుతంగా ఉంటుంది.

512
నీల్ ఐలాండ్ (షహీద్ ద్వీపం)

ఈ నీల్ ఐలాండ్ కూడా బీచ్ లకు బాగా ప్రసిద్ది చెందింది. ఇక్కడ భరత్ పూర్ బీచ్, లక్ష్మణ్ పూర్ బీచ్, సీతాపూర్ బీచ్ లు ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి అందాలతో పాటు వాటర్ గేమ్స్ ను ఎంజాయ్ చేయవచ్చు.

612
రాస్ ఐలాండ్

ఇది ఒకప్పటి బ్రిటీష్ పాలకుల ప్రధాన కార్యాలయం... కానీ ప్రస్తుతం ఈ ఐలాండ్ శిథిలావస్థలో ఉంది. దీని పేరును 2018 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా మార్చారు. పాతకాలపు కట్టడాలు, జపనీస్ బంకర్లు కలిగివుంది. అలాగే దట్టమైన అడవులు, జంతువులు పర్యాటకులను కట్టిపడేస్తాయి.

712
నార్త్ బే ఐలాండ్

ఇదికూడా అండమార్ నికోబార్ దీవుల్లో తప్పకుండా చూసితీరాల్సిన ఐలాండ్. పకడపు దిబ్బలతో కూడిన ప్రాంతమిది. వాటర్ గేమ్స్ కూడా ఉంటాయి.

812
బరాటాంగ్ ద్వీపం

ఇది సున్నపురాయి గుహలు, మడ్ అగ్ని పర్వతాలు, మడ అడవులతో కూడిన పర్యాటక ప్రాంతం. సాహసోపేతమైన పర్యటనను కోరుకునేవారికి బరాటాంగ్ ద్వీపం బాగా నచ్చుతుంది. వేలాది చిలుకలతో కూడిన ప్యారట్ ఐలాండ్ కూడా ఈ ద్వీపంలో చూడవచ్చు.

912
బర్డ్ ఐలాండ్

దీన్ని చిడియా తపు అనికూడా అంటారు. దట్టమైన అడవుల్లో అరుదైన పక్షులతో కూడిన ప్రాంతమిది. ఇక్కడ 240 కి పైగా అరుదైన జాతుల పక్షులు ఉంటాయని అంచనా. దట్టమైన అడవుల గుండా ట్రెకింగ్ మరపురాని అనుభూతిని ఇస్తుంది.

1012
అండమాన్ ఆండ్ నికోబార్ దీవులకు ఎప్పుడు వెళ్లాలి..?

ఈ దీవుల సందర్శనకు అక్టోబర్ నుండి మే ఉత్తమ సమయం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాకాలం ఈ దీవుల్లో ప్రయాణం చాలాకష్టం... అందుకే జూన్ నుండి సెప్టెంబర్ వరకు పర్యాటకుల సందర్శన చాలా తక్కువగా ఉంటుంది.

ఈ అండమాన్ నికోబార్ దీవులు బీచ్ లకు బాగా ప్రసిద్ది. ఇక్కడ స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ను ఎంజాయ్ చేయవచ్చు. అలాగే బీచ్ హోపింగ్, ఐలాండ్ టూర్స్, సెల్యులార్ జైలు సందర్శన, ట్రెక్కింగ్, సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.

1112
అండమాన్ ఆండ్ నికోబార్ దీవుల్లో ప్రయాణం, వసతి సౌకర్యాలు..

ఈ దీవుల మధ్య ప్రయాణానికి ఫెర్రీలు, బోట్లు ఉన్నాయి. స్థానికంగా తిరగడానికి టాక్సీలు, ఆటోలు, బైక్‌లు అద్దెకు దొరుకుతాయి. పోర్ట్ బ్లెయిర్‌కు విమాన సౌకర్యం ఉంది. దేశంలోని అనేకప్రాంతాల నుండి ఇక్కడి విమాన సర్వీసులు ఉన్నాయి.

ఇక వసతి విషయానికి వస్తే బడ్జెట్ గెస్ట్‌హౌస్‌ల నుండి లగ్జరీ రిసార్ట్‌లు ఉన్నాయి. అన్ని రకాల వసతి అందుబాటులో ఉన్నాయి. హేవ్‌లాక్, నీల్ దీవులలో ఎకో-రిసార్ట్‌లు కూడా ఉన్నాయి.

1212
అండమాన్ పర్యటనలో ఏం తినాలి?

తాజా సీఫుడ్ ఇక్కడ ప్రత్యేకం. కొబ్బరి పాలతో చేసిన కూరలు, గ్రిల్డ్, ఫ్రైడ్ సీఫుడ్ రుచి చూడాల్సిందే. అన్ని రకాల వంటకాలు లభిస్తాయి. పోర్ట్ బ్లెయిర్ లో అన్నిరకాల వంటకాలు లభించే రెస్టారెంట్స్ ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories