Air india crash: విమాన ప్ర‌మాదానికి ముందు క‌నిపించిన ‘రాట్’.. ఇదే అస‌లు కార‌ణ‌మా.?

Published : Jun 16, 2025, 02:42 PM ISTUpdated : Jun 16, 2025, 02:47 PM IST

ఎయిర్ ఇండియా విమాన ప్ర‌మాదం ఎంత‌టి విషాదాన్ని మిగిల్చిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ ఘోర సంఘ‌ట‌న‌లో ఏకంగా 240కి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌న్న దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. 

PREV
16
20 ఏళ్ల‌లో అతిపెద్ద ప్ర‌మాదం

2024 జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌ లైనర్ ప్రమాదం, గత రెండు దశాబ్దాలలో భారత్‌ లో జరిగిన భయంకరమైన విమాన ప్రమాదంగా నిలిచింది. ఈ ప్రమాదంలో ఏకంగా 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. డ్రీమ్‌లైనర్‌కు సంబంధించిన తొలి ఘోర ప్రమాదం ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

26
ఎన్నో వాద‌నలు

ఎయిర్ ఇండియా ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌న్న దానికి సంబంధించి ఎన్నో వాద‌న‌లు వినిపిస్తున్నాయి. బ్లాక్ బాక్స్‌లో న‌మోదైన స‌మాచారం ఆధారంగా విమానానికి విద్యుత్ స‌దుపాయం నిలిచిపోయినందునే ప్ర‌మాదం జ‌రిగింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ప్ర‌మాదానికి ముందు పైల‌ట్ మేడే అంటూ.. నో ప‌వ‌ర్ అని మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది.

36
క‌నిపించిన రాట్ యంత్రం.

అయితే తాజాగా అమెరికా నావికాదళానికి చెందిన మాజీ పైలట్ కెప్టెన్ స్టీవ్ షైబ్‌నర్, ఈ ఘటనపై విశ్లేషణ చేశారు.

ప్రమాద సమయంలో తీసిన స్పష్టమైన వీడియోను పరిశీలించిన తర్వాత, విమాన మ‌ధ్య భాగంలో ఒక చిన్న గోళాకార వస్తువు కనిపించిందని తెలిపారు. దానిని రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) అని గుర్తించారు.

ఈ RAT యంత్రం సాధారణ పరిస్థితుల్లో పనిచేయదు. విమానానికి రెండు ఇంజిన్లు పని చేయ‌ని స‌మ‌యంలోనే ఇది విమానం నుంచి బయటకు వస్తుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌ను అందించేందుకు ఉపయోగపడుతుంది.

46
వీడియోలో వినిపించిన ఆడియో

ఇక వైర‌ల్ అయిన వీడిలో వినిపించి శ‌బ్ధానికి కూడా RAT యంత్రం వేగంగా తిరుగుతున్నప్పుడు వచ్చే శబ్దమని స్టీవ్ చెప్పారు. అలాగే ప్రమాదం నుంచి బతికిపోయిన ఏకైక ప్రయాణికుడు – 11A సీట్లో కూర్చున్న వ్యక్తి  ప్రమాదానికి ముందు “ఒక పెద్ద శబ్దం వచ్చింది, వెంటనే కేబిన్ లైట్లు ఆఫ్ అయ్యాయ‌ని” అని చెప్పాడు. ఇది RAT యంత్రం బయటకు వచ్చినప్పుడు జరిగే లక్షణాలకు చాలా దగ్గరగా ఉందని చెప్పుకొచ్చారు.

56
కీల‌కంగా మారిన ‘మేడే’ కాల్‌

ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు పైలట్ ‘మేడే’ (అత్యవసర సంకేతం) ఇచ్చినట్టు అనధికారిక సమాచారం వచ్చింది. ఇది ఇంజన్ పవర్ కోల్పోయే పరిస్థితిని సూచించవచ్చని స్టీవ్ అభిప్రాయపడ్డారు. అయితే ఇంకా ఏటీసీ (Air Traffic Control) రికార్డులు విడుదల చేయ‌లేద‌న్నారు.

66
అదే కార‌ణ‌మై ఉండొచ్చు

స్టీవ్ షైబ్‌నర్ వ్యాఖ్యల ప్రకారం.. “రెండు ఇంజన్ల వైఫల్యం అనేది ప్ర‌మాదానికి అత్యంత బలమైన కారణంగా కనిపిస్తోంది. కానీ ఇంజ‌న్లు ఎందుకు ఆగిపోయాయ‌న్న ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం ల‌భించ‌లేదు. 

ఇది చాలా పెద్ద ప్రశ్నగా మిగిలింద‌న్నారు. ఈ డ్రిమ్‌లైనర్ గతంలో 8,000 కంటే ఎక్కువ విమానాల ప్రయాణం, 41,000 గంటల పైగా ఎయిర్ టైమ్ పూర్తి చేసింది. ప్రమాదానికి కారణాల‌పై అధికారులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories