Published : Jun 16, 2025, 02:40 PM ISTUpdated : Jun 16, 2025, 02:52 PM IST
అహ్మదాబాద్ విమానప్రమాదం నుండి అదృష్టవశాత్తు కొందరు బైటపడ్డారు. ఈ విమానంలో ప్రయాణించాల్సివున్నా వివిధ కారణాలతో ఎక్కలేకపోయారు. ఇలా ఎవరు ఏ కారణాలతో విమానం ఎక్కకుండా ప్రాణాలతో బైటపడ్డారో తెలుసుకుందాం.
Ahmedabad Plane Crash : ఏది జరిగినా మనమంచికే అంటుంటారు పెద్దలు... వీరి విషయంలో ఇదే నిజమయ్యింది. ఇటీవల అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం వందలాదిమంది ప్రాణాలను బలితీసుకుంది... కానీ కొందరు ఈ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ విమానంలో ప్రయాణించాల్సినవారు వేరువేరు కారణాలతో మిస్సయ్యారు.. ఇలా విమానం ఎక్కకపోవడమే వీరి ప్రాణాలు కాపాడింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంనుండి తప్పించుకున్నవారు తమ ప్రయాణం ఎలా క్యాన్సిల్ అయ్యిందో వివరిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతమంది ఎలా ఈ విమాన ప్రమాదం బారినుండి బైటపడ్డారో తెలుసుకుందాం. వీరిలో కొందరు విమానాశ్రయం వరకు వెళ్లికూడా విమానం ఎక్కలేకపోయారు. ఇంకా భూమిమీద నూకలు మిగిలివున్నాయి కాబట్టే ఆ దేవుడే విమానం ఎక్కనివ్వలేదని వారు అంటున్నారు.
25
ఎయిర్ పోర్టులోనే ఆగిపోయిన జంట
అహ్మదాబాద్ కు చెందిన జైమిన్ పటేల్, ప్రియా దంపతులు సరదాగా లండన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం అంతా రెడీ చేసుకున్నారు... జూన్ 12న ప్రమాదానికి గురయిన విమానంలోనే ప్రయాణించాల్సి ఉంది. టికెట్స్ కూడా ముందుగానే బుక్ చేసుకున్నారు. కానీ వారి అదృష్టం బాగుండి విమానం ఎక్కలేకపోయారు. అప్పుడు విమానం మిస్సయ్యిందని బాదపడినా… తర్వాత ప్రమాదం గురించి తెలిసి ఆ దేవుడే తమను ఆపాడని సదరు జంట అంటున్నారు.
లండన్ వెళ్లేందుకు లగేజ్ తో సహా విమానాశ్రయానికి చేరుకున్న జైమిన్, ప్రియా దంపతులను సరైన పత్రాలు లేవని సిబ్బంది అడ్డుకున్నారు. ఎంత బ్రతిమాలినా అధికారులు తమను విమానం ఎక్కేందుకు అంగీకరించలేదని.. ఇదే తమ ప్రాణాలు కాపాడిందని దంపతులు అంటున్నారు. లండన్ ట్రిప్ క్యాన్సిల్ కావడంతో ఎంతో నిరాశతో విమానాశ్రయం నుండి ఇంటికి వెళ్లిపోయామని... కానీ విమాన ప్రమాద వార్త తెలిసాక ఆ దేవుడు అధికారుల రూపంలో వచ్చి తమను ఆపారని అనుకుంటున్నామని పటేల్ దంపతులు తెలిపారు.
35
ఆమెను ట్రాఫిక్ జామ్ కాపాడింది
భరూచ్ కి చెందిన భూమి చౌహాన్ అహ్మదాబాద్ నుండి లండన్ లోని భర్త వద్దకు వెళ్లేందుకు సిద్దమయ్యింది. అయితే నగరంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ కారణంగా ఆమె సరైన సమయానికి ఎయిర్ పోర్టుకు చేరుకోలేకపోయింది. 10 నిమిషాలు ఆలస్యంగా ఎయిర్ పోర్టుకు చేరుకోవడంతో అప్పటికే గేట్లు మూసివేసారు. ఆమె వేడుకున్నా విమానాశ్రయ సిబ్బంది అనుమతించలేదు... దీంతో భూమి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ట్రాఫిక్ జామ్ ఆమె ప్రాణాలు కాపాడింది.
వడోదరకు చెందని యమన్ వ్యాస్ గతంలో లండన్ లో పనిచేసాడు... ఇండియాకు వచ్చి రెండేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. అయితే ఇటీవల జూన్ 12న అతడు లండన్ తిరిగివెళ్లడానికి సిద్దమయ్యాడు.. ప్రమాదానికి గురయిన ప్లైట్ లోనే వెళ్లాల్సివుంది.
అయితే సరిగ్గా బయలుదేరేముందు అతడి తల్లి ప్రేమగా ఇంకొన్నిరోజులు తమతో ఉండిపోవాలని కోరగా యమన్ కాదనలేకపోయాడు. ఇలా తల్లిమాట విని ప్రయాణాన్ని రద్దుచేసుకున్నాడు... దీంతో ప్రాణాలు దక్కాయి. ఇలా అతడికి జన్మనిచ్చిన తల్లి మరోసారి పునర్జన్మ కూడా ఇచ్చింది.
55
వీరి ప్రయాణం కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్...
లండన్ లోని కొడుకు వద్దకు వెళ్లేందుకు సిద్దమైన సవ్జీ టింబడియా కూడా చివరి నిమిషయంలో మనసు మార్చుకుని ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాడు. జయేష్ ఠక్కర్, రవ్జీ పటేల్ లు కూడా సరిగ్గా విమాన ప్రయాణ సమయంలోనే ఇండియాలో పని ఉండటంతో ఆగిపోయి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ నిర్ణయం వారి ప్రాణాలను కాపాడింది... లేదంటే విమాన ప్రమాదం బారిన పడేవారు.