Published : Jun 15, 2025, 08:27 PM ISTUpdated : Jun 15, 2025, 08:28 PM IST
From 25000 salary to 5 crore wealth: రూ.25,000 జీతంతో ప్రయాణం మొదలుపెట్టి 11 ఏళ్లలో రూ.5 కోట్ల సంపద నిర్మించిన ఒక ఉద్యోగి కథ ప్రతి మధ్యతరగతి ఉద్యోగికి ఆదర్శంగా.. ఆచరించాల్సిన అంశంగా నిలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
From 25000 salary to 5 crore wealth: 2013లో రూ.25,000 నెలజీతంతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఓ మధ్యతరగతి యువకుడు, కేవలం ఆర్థిక శ్రమ, దూరదృష్టి పెట్టుబడుల ద్వారా 11 ఏళ్లలో రూ.5 కోట్ల సంపదను సాధించాడు. వ్యాపారం లేదా వారసత్వ ఆదాయం లేకుండా, కేవలం జీతంతో సంపద సృష్టించిన ఈ ప్రయాణం ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
26
పొదుపు పద్ధతులు, అప్పులు లేకపోవడం
ఆరంభ దశలో తన ఆదాయంలో 25% పొదుపు చేయడాన్ని అలవాటు చేసుకున్నాడు. అయితే, తన స్వగ్రామానికి మారిన తర్వాత అద్దె ఖర్చు లేకపోవడంతో పొదుపు శాతం 75%కి పెంచగలిగాడు. అప్పుల నుంచి దూరంగా ఉండటం, ఖర్చులను నియంత్రించడం ద్వారా పెట్టుబడి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాడు.
36
ఒక్క నిజమైన కథ తో వచ్చిన ప్రేరణ
ఒక వెల్త్ మేనేజర్‌గా పని చేస్తున్న సమయంలో ఓ ITC ఉద్యోగి 20 ఏళ్లలో స్టాక్ ఆప్షన్లతో రూ.5 కోట్ల సంపద సృష్టించిన దృశ్యం అతనికి దీర్ఘకాలిక పెట్టుబడులపై విశ్వాసాన్ని కలిగించింది. దీంతో చిన్న కంపెనీలను లక్ష్యంగా పెట్టుకొని, బలమైన ఫండమెంటల్స్ కలిగిన కంపెనీల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు.
2020 మార్కెట్ కుప్పకూలిన సందర్భంలోనూ అవకాశాలు వెతికాడు
2020లో కరోనా వైరస్ కారణంగా మార్కెట్ పడిపోయినప్పుడు అతని పోర్టుఫోలియో 45% తగ్గిపోయింది. కానీ భయపడకుండా అదే సమయంలో ఎక్కువగా షేర్లు కొనుగోలు చేశాడు. ఈ ధైర్య నిర్ణయం తర్వాతి సంవత్సరాల్లో భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
56
ప్రస్తుత ఆర్థిక స్థితి
ప్రస్తుతం అతని సంపదలో 90% ఈక్విటీల్లో ఉంది. మిగిలినది నగదు, నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) రూపంలో ఉంది. IndiGrid వంటి REITల ద్వారా పాసివ్ ఆదాయ వనరులను కూడా పరిశీలిస్తున్నాడు.
66
ఉద్యోగ మార్గంలో వ్యూహాత్మక అభివృద్ధి
ఇంజినీరింగ్ తర్వాత ఎంబీఏ పూర్తి చేయడం ద్వారా తన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నాడు. తొలినాళ్లలో పీపీఎఫ్ ఖాతా ప్రారంభించడం, ఐఫోన్ కొనుగోలు వంటి ఖరీదైన ఖర్చులను తగ్గించడం వంటివి ఆర్థిక నియంత్రణను స్పష్టంగా చూపిస్తాయి.
సామాన్య ప్రజలు చేసే పొరపాట్లను నివారించడమే అతని విజయ రహస్యాలలో ఒకటి. క్రిప్టోకరెన్సీ లేదా దివాళా సంస్థల్లో పెట్టుబడుల నుంచి దూరంగా ఉండటం, మార్కెట్ టైమింగ్ కన్నా దీర్ఘకాలిక పెట్టుబడి శ్రద్ధ ఇవ్వడం అతను పాటించిన ముఖ్యమైన విధానం.