మోడీ కాశ్మీర్ యార్కర్ : ఇమ్రాన్ ఖాన్ క్లీన్ బౌల్డ్

First Published Aug 10, 2019, 3:17 PM IST

గత కొన్ని రోజులుగా భారత రాజ్యాంగంపైన భారతదేశంలోకన్నా పాకిస్థాన్ లో చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడి అన్ని మీడియా ఛానెల్లు భారత రాజ్యాంగంపైనా, ఆర్టికల్ 370పైన చర్చలు పెడుతూ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అధికారంలో ఉన్న నాయకుడికి ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాలను రాసుకునే దేశం, రాజ్యాంగానికి లోబడి పనిచేసే భారతదేశం గురించి మాట్లాడం హాస్యాస్పదం.

గత కొన్ని రోజులుగా భారత రాజ్యాంగంపైన భారతదేశంలోకన్నా పాకిస్థాన్ లో చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడి అన్ని మీడియా ఛానెల్లు భారత రాజ్యాంగంపైనా, ఆర్టికల్ 370పైన చర్చలు పెడుతూ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అధికారంలో ఉన్న నాయకుడికి ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాలను రాసుకునే దేశం, రాజ్యాంగానికి లోబడి పనిచేసే భారతదేశం గురించి మాట్లాడం హాస్యాస్పదం. ఏనాడూ అంతర్జాతీయంగాకానీ, ద్వైపాక్షికంగాకానీ, కనీసం తమ దేశ ప్రజలకు ఇచ్చిన మాటను కూడా నిలుపుకోని పాకిస్థాన్, కాశ్మీర్ విషయంలో భారత్ మాట తప్పిందనడం మరీ విడ్డూరం.
undefined
ఇవన్నీ ఒకెత్తయితే, పాక్ అధ్యక్షుడు ఏకంగా ట్రంప్ ని కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేయమని అడగడం పూర్తిగా అనైతికం. షిమ్లా ఒప్పందం(1972) నుంచి లాహోర్ ఒప్పందం(1999), ఇస్లామాబాద్ డిక్లరేషన్(2004) వరకు అందరు పాకిస్తాన్ దేశాధినేతలు బయటకు మాత్రం భారత్, పాక్ లు తమ మధ్య ఉన్న వివాదాలను ద్వైపాక్షికంగానే తేల్చుకుంటామని చెబుతూ వస్తున్నారు. మొదటి సారి ఇమ్రాన్ ఖాన్ ఇలా బాహాటంగా ఈ మూడు ఒప్పందాలను తుంగలో తొక్కుతూ ట్రంప్ ని మధ్యవర్తిత్వం చేయమని అడిగాడు. ఇలా అన్ని ఒప్పందాలను తుంగలో తొక్కిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు భారత్ షిమ్లా ఒప్పందాన్ని అతిక్రమించింది అంటూంటే ప్రపంచం నోరెళ్లబెడుతోంది.
undefined
ఈ సందర్భంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఉంది. 1947 నుంచి కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ మొదటగా ఏదోఒక కవ్వింపు చర్యలకు దిగితే దానికి భరత్ ప్రతిస్పందించేది. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. 1947లో ఆపరేషన్ జీబ్రాల్టర్ నుంచి మొదలు 1965లో ఆపరేషన్ గ్రాండ్ స్లాం వరకు పాకిస్థాన్ మొదటగా కాశ్మీరులో ఏదో ఒక అల్లకల్లోలం సృష్టించే దిశగా ముందు దాడులకు దిగేది. 1972 షిమ్లా ఒప్పందం కుదిరేవరకు ఇదే పరిస్థితి.
undefined
షిమ్లా ఒప్పందం కుదిరిన తరువాత 17ఏళ్లపాటు కొంత శాంతియుత పరిస్థితులు నెలకొన్నప్పటికీ, పాకిస్థాన్ పూర్తిగా శాంతిని మాత్రం కోరుకోలేదు. ఈ సమయంలో అణ్వాయుధాలను తయారుచేసుకునే పనుల్లో నిమగ్నమయిపోయింది. ఈ తరుణంలోనే రష్యాను ఆఫ్ఘానిస్తాన్ నుంచి బయటకు పంపడానికి అమెరికాకు సహకరించింది. ఎప్పుడైతే ఆ పని 1989లో విజయవంతంగా పూర్తయ్యిందో, అదే సంవత్సరం పాకిస్థాన్ అణు పరీక్షలను కూడా పూర్తి చేసింది. దీనితో ఖాళీగా మారిన పాకిస్తాన్, అణ్వస్త్రాలను కలిగి ఉన్నామనే దుర్భుద్ధితో మరోమారు కాశ్మీర్ వైపుగా తన కదలికలను ప్రారంభించింది.
undefined
ఇక అప్పటినుంచి మొదలు కార్గిల్ యుద్ధం, ఐ సి - 814 విమాన హైజాక్ ఉదంతం, భారత పార్లమెంటుపై దాడి, 2611 దాడులు, పఠాన్ కోట్, పుల్వామా ఇలా అనేక దాడులకు పాల్పడింది. ప్రతిసారి పాక్ ఏదో ఒక కవ్వింపు చర్యకు దిగినతరువాత భారత్ తన స్పందనల కోసం వెదుకులాటలో మిగిలిపోయేది. భారత్ ఇంత పెద్ద దేశమైనప్పటికీ తన బలాన్ని ఏనాడూ అకారణంగా వాడలేదు. కానీ మొదటిసారిగా భారత్ ఇప్పుడు చరిత్రను తిరగరాసింది. భారత్ తీసుకున్న చర్యలతో ఎలా స్పందించాలో అర్థంకాక పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయింది.
undefined
పూర్వం పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగిన తరువాత, రాయబారిని వెనక్కి పిలిపించడం, వాణిజ్యాన్ని రద్దు చేయడం వంటి ప్రస్తుత పాకిస్తాన్ చేర్యాలనే భారత్ అవలంబించేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. వీటితోపాటు, భారత్ బలగాల మోహరింపునకు దిగుతుండగానే పాకిస్థాన్ తన వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయనే బూచిని ప్రపంచానికి చూపేది. ఈ అణ్వస్త్రాలను ప్రయోగిస్తాము అనే డ్రామా మొదలుపెట్టేది. ఉపఖండంలో శాంతి నెలకొనాలంటే భారత్ ని దాడికి దిగకుండా ఆపండని ప్రపంచదేశాలను బెదిరించేది.కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లోశాంతియుత వాతావరణం కోసం ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ను కట్టడి చేసే పనిలో నిమగ్నమయిపోయాయి.
undefined
పాకిస్తాన్ ఇప్పుడు ఉన్న ఆర్ధిక పరిస్థితుల్లో ప్రపంచ దేశాల మాటకు తలొగ్గక తప్పదు. పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితిని గనుక పరిశీలిస్తే, ఒక అమెరికన్ డాలర్ 165 పాకిస్తానీ రూపాయలతో సమానం. కేవలం 42వేల కోట్ల కోసం తనని తాను ఐఎంఎఫ్ వద్ద తాకట్టు పెట్టుకుంది. భారత్ లో జరిగే ఐ పి ఎల్ ఈవెంట్ బ్రాండ్ వాల్యూనే 46,000 కోట్లు. ఇప్పుడు అర్థం చేసుకోండి పాకిస్తాన్ ఆర్ధిక పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితుల్లోఉందో !
undefined
ఇలా అమెరికా వెళ్లివచ్చి ప్రపంచదేశాల మద్దతును కూడగట్టుకోగలిగాము అనుకుంటున్న ఇమ్రాన్ ఖాన్ ను మోడీ కాశ్మీర్ అనే యార్కర్ సంధించి క్లీన్ బౌల్డ్ చేసాడు అని చెప్పడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు.
undefined
click me!