Pressure Cooker: కుక్కర్లో కేవలం పప్పు, అన్నమే కాదు.. నాన్, పెరుగు, కుకీలు కూడా ఇలా చేసేయండి

Published : Dec 30, 2025, 04:44 PM IST

Pressure Cooker: ప్రెషర్ కుక్కర్ ప్రతి ఇంట్లోను ఉంటుంది. అయితే అందరూ దాన్ని పప్పు ఉడకబెట్టడానికి, అన్నం వండడానికి మాత్రమే వినియోగిస్తారు. నిజానికి కుక్కర్ ను ఉపయోగించి రకరకాల వంటకాలు చేయవచ్చు. కుక్కర్ ను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో ఇక్కడ ఇచ్చాము. 

PREV
13
నాన్ ఇలా చేసేయండి

ప్రెషర్ కుక్కర్ లేని ఇల్లు ఇప్పుడు లేదు. ప్రెషర్ కుక్కర్లో ప్రతిరోజు అన్నం వండడం లేదా పప్పు ఉడకబెట్టడం, సాంబారు చేయడం వంటివే చేస్తారు. నిజానికి ప్రెషర్ కుక్కర్ తో అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ఎన్ని రకాలుగా ప్రెషర్ కుక్కర్‌ను వాడుకోవచ్చో తెలుసుకోండి. కుక్కర్‌ను ఉపయోగించి తందూరి రోటీని, నాన్ వంటివి వండుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ ను తలకిందులుగా చేసి స్టవ్ మీద పెట్టండి. మంట వల్ల ప్రెషర్ కుక్కర్ వెనుక భాగం బాగా వేడెక్కుతుంది. అప్పుడు నాన్ ను కుక్కర్ లోపల అతికించండి. తరువాత మళ్లీ కుక్కర్ ను మళ్ళీ తలకిందులుగా పెట్టివేసి కాల్చుకోవాలి. తందూరి రోటి, నాన్ రెడీ అయిపోతాయి.

23
కుకీలు చేసేయండి

ప్రెషర్ కుక్కర్ ను ఓవేన్ గా కూడా మార్చుకొని ఉపయోగించుకోవచ్చు. కేకులు, కుకీలు వంటివి ఇందులో సులభంగా చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగానే కుక్కర్ ని కొంచెం ప్రీ హీట్ చేసుకుని.. అప్పుడు అందులో కేకులు కుకీలు వంటివి తయారు చేసుకోవాలి. కుక్కర్ లోపల ఇసుకను లేదా ఉప్పు పోసి పైన మూత పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి. తరువాత గిన్నెల్లో కుకీలు, కేకు మిశ్రమం వేసి ఉడికించుకోవాలి. ఇక కుక్కర్లో పాప్ కార్న్ చేయడం అందరికీ తెలిసిందే. పాప్ కార్న్ గింజలను అందులో వేసి కాస్త బటర్ వేసి మూడు నిమిషాలు అధిక వేడి మీద ఉంచితే చాలు పాప్ కార్న్ సిద్ధమైపోతుంది. 

33
గడ్డ పెరుగు చేసేయండి

ఇక కుక్కర్ లో చాలా సులువుగా పెరుగు తయారు చేసుకోవచ్చు. చలికాలంలో పెరుగు ఒకంతట తయారవదు. ఇందుకోసం ముందుగా గోరువెచ్చని పాలు తీసుకొని అందులో పెరుగు కలపండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి కొద్దిగా వేడి చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చుట్టూ కిచెన్ టవల్ ను చుట్టండి. ఇక పెరుగు పాలు పోసిన గిన్నెను అందులో ఉండనివ్వండి. ఇలా చేస్తే పెరుగు తయారవుతుంది. చలికాలంలో సాధారణంగా పెరుగు తయారవడం చాలా కష్టం. ఇలా అయితే ప్రెషర్ కుక్కర్లో పెరుగు సిద్ధమైపోతుంది. కొన్నిసార్లు కుక్కర్ నుంచి నీరు బయటకు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కుక్కర్లో పప్పు, బియ్యం వంటివి వేసి అలాగే చిన్న స్టీల్ గిన్నె లేదా స్టీల్ స్పూను ఉంచితే నీరు బయటకు రాకుండా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories