వైన్ తాగే గ్లాస్ ఆకారం, పరిమాణం దాని రుచి, సువాసనపై ప్రభావం చూపుతాయి.
రెడ్ వైన్ గ్లాస్: పెద్ద బౌల్ ఆకారంలో ఉంటుంది. దీంతో వైన్‌కు గాలి బాగా తగిలి రుచి మరింత మెరుగవుతుంది.
వైట్ వైన్ గ్లాస్: కొద్దిగా సన్నగా ఉంటుంది. దీంతో వైన్ చల్లదనాన్ని ఎక్కువసేపు నిలుపుకోవచ్చు.
రోజే వైన్ గ్లాస్: వైన్ రంగు, సువాసన బాగా ఆస్వాదించేలా ప్రత్యేక ఆకారంలో ఉంటుంది.
స్పార్క్లింగ్ వైన్ లేదా షాంపేన్: పొడవుగా, సన్నగా ఉండే ఫ్లూట్ గ్లాస్‌లో వడ్డిస్తారు. దీంతో బుడగలు ఎక్కువసేపు నిలుస్తాయి.
సరైన గ్లాస్ ఉపయోగిస్తే వైన్ అసలు రుచి, సువాసనను పూర్తిగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది.