Chanakya Niti: మీకు మీ భార్య మీద చాలా ప్రేమ ఉందా? నిజంగా ఆమె పై ప్రేమ ఉంటే.. మీ భార్యను పొరపాటున కూడా ఐదు ప్రదేశాలకు తీసుకొని వెళ్లొద్దని చాణక్యుడు చెబుతున్నాడు..
పెళ్లి తర్వాత..ప్రతి అమ్మాయి తన కుటుంబాన్ని వదిలేసి అత్తారింట్లో అడుగుపెడుతుంది. భర్తే సర్వస్వంగా బతుకుతుంది. అలాంటి అమ్మాయిని జాగ్రత్తగా, ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత భర్తపైనే ఉంటుంది. అయితే.. భార్యను నిజంగా ప్రేమించే వ్యక్తి...ఎంతో గొప్ప గొప్ప ప్రదేశాలకు తీసుకొని వెళ్లినా, తీసుకువెళ్లకపోయినా... కొన్ని ప్రదేశాలకు మాత్రం పొరపాటున తీసుకువెళ్లకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. ఎలాంటి ప్రదేశాలకు తీసుకువెళ్లకూడదు..? తీసుకువెళ్లడం వల్ల కలిగే నష్టం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...
23
శత్రువులు, ప్రత్యర్థుల ఇంటికి...
చాణక్యుని ప్రకారం, మీకు జీవితంలో ఎవరైనా శత్రువులు, ప్రత్యర్థులు ఉంటే.. వారి ఇంటికి, వారు ఉండే ప్రదేశంలోకి పొరపాటున కూడా మీ భార్యను తీసుకువెళ్లొద్దు. మీ విరోధులు మీ భార్యను మీతో చూసి.. మీ బలహీనతలను ఆసరగా చేసుకునే అవకాశం ఉంది. అటువంటి ప్రదేశాలలో మీ భార్య భద్రతకు కూడా ప్రమాదం కలిగించొచ్చు. అందుకే..ఈ ప్రదేశానికి పొరపాటున కూడా తీసుకువెళ్లకూడదు.
సీక్రెట్ మీటింగ్స్..
భర్తకు వృత్తి పరంగా ఏవైనా సీక్రెట్స్ ఉంటే.. అలాంటి సీక్రెట్స్ చర్చలకు భార్యను దూరంగా ఉంచాలి. ఒకవేళ అలాంటి చర్చలు ఇంట్లో జరిగినా, భార్యను ఆ ప్రదేశానికి దూరంగా ఉంచాలి. కొన్ని విషయాలను భార్య దగ్గర సీక్రెట్ గా ఉంచినప్పుడే.. విజయం దక్కుతుందని చాణక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే.. చాలా మంది స్త్రీలు ఏ విషయాన్ని దాచిపెట్టుకోలేరు. ఎవరో ఒకరికి చెప్పేస్తూ ఉంటారు. దీని వల్ల మీరు విజయానికి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పొరపాటు చేయకూడదని చాణక్యుడు చెబుతున్నాడు.
33
గొడవలు జరిగే ప్రదేశానికి..
గొడవలు, వివాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశానికి మీ భార్యను తీసుకువెళ్లడం మంచిది కాదు. ఇలా తీసుకువెళ్లడం వల్ల మీ ప్రాణానికి, మీ భార్య ప్రాణానికి ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే.. ఇలాంటి ప్రదేశాలకు భార్యను తీసుకువెళ్లకూడదు. ఒంటరిగా వెళ్తే.. మిమ్మల్ని మీరు కాపాడుకునే ఛాన్స్ ఉంటుంది. పక్కన భార్య ఉంటే.. ఇద్దరిని కాపాడుకోవడం కష్టం అవుతుందని చాణక్యుడు చెబుతున్నాడు.
ప్రమాదకరమైన ప్రయాణాల్లో...
అడవి లేదా ఏదైనా యుద్ధ వాతావరణం ఉన్న ప్రదేశాలకు కూడా మీ భార్యను తీసుకువెళ్లకూడదు. భార్య భద్రతకు భర్తే బాధ్యుడు. అటువంటి ప్రదేశాలలో ఆమెను చూసుకోవడం చాలా కష్టమౌతుంది. అందుకే.. ఆ పొరపాటు చేయకూడదని చాణక్యుడు చెబుతున్నాడు.