అమ్మాయిలను పడేయడానికి, మనసులు గెల్చుకోవడానికి అబ్బాయిలు రకరకాల వ్యూహాలు పన్నుతుంటారు. కానీ అమ్మాయిలు మాత్రం బంగారం స్వచ్ఛతను పరీక్షిస్తున్నట్టుగా అతడి నిజాయతీ, వ్యక్తిత్వం, గుణగణాలు పరీక్షిస్తారు. అవి నచ్చితేనే తన మనసు అర్పిస్తారు.
చాణక్య నీతి ప్రకారం ఆడవాళ్లతో మర్యాదగా వ్యవహరించే మగాళ్లనే ఇష్టపడతారు. నిజాయితీకి ప్రాధాన్యం ఇస్తారు. వాళ్లకు తమ ఆత్మగౌరవం ముఖ్యం. అమ్మాయిలను చిన్నచూపు చూడని మగాడితో జీవితాంతం సంతోషంగా ఉండవచ్చని వారు భావిస్తారు. పురుషుడు ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా అలాంటి మగవారికే ఆడవాళ్లు త్వరగా ఆకర్షితులు అవుతారు.
అంతేకాదు.. ముక్కుసూటిగా మాట్లాడే కుర్రాళ్లంటే అమ్మాయిలకు తెగ ఇష్టం ఉంటుందంటారు చాణక్యుడు. వాళ్లతో సున్నితంగా వ్యవహరిస్తూ ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్లంటే వెంటనే పడిపోతారట. ఇలాంటి లక్షణాలు కనిపించిన మగవాళ్లను చూడగానే టపీమని ప్రేమలో పడిపోతారు.
నిగ్రహంతో ఉండే కుర్రాళ్లను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అతి కోపం, అతిగా స్పందించడం వాళ్లకి ఇష్టం ఉండదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిగ్రహంగా ఉండాలి. ఓర్పుగా సమస్యలను పరిష్కరించుకోగలగాలి. ఇలా శాంతియుతంగా ఉండే పురుషులను ఇష్టపడతారు. ఈ వ్యక్తిత్వం ఉంటే అందానికంటే వ్యక్తిత్వానికే ఓటేస్తారు. ఆడవాళ్లు తమ బాధను చెబితే చికాకు పడకుండా వినే మగవారిని ఇష్టపడతారు. అంతేకాదు, ఆమె మనస్సులోని బాధను ముందుగానే అర్థం చేసుకునే వాళ్లని తప్పకుండా ప్రేమిస్తారు.