hairstyles వేసవిలో సౌకర్యంగా, స్టైలిష్ గా ఉండే హెయిర్‌స్టైల్స్.. అంతా ఫిదా అయిపోవాల్సిందే!

అసలే వేసవి కాలం. అమ్మాయిలకేమో జుట్టు పొడుగ్గా ఉంటుంది. అది ముడి విడిపోయిందా.. ఇక అంతే సంగతులు. చెమట్లు పడుతూ, మొహంపై జుట్టు పడుతూ చిరాకుచిరాకుగా ఉంటుంది. పైగా ఏ పెళ్లిలాంటి శుభాకార్యమో అయితే వాళ్ల బాధ చెప్పరాకుండా ఉంటుంది. ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి వేసవిలో ఎలాంటి హెయిర్ స్టైల్ పాటించాలో మీకు వివరిస్తాం. ఎంచక్కా దాన్ని ఫాలో అయిపోండి మరి. ఇందులో మెస్సీ బ్రెయిడ్, ఫిష్ టెయిల్ బ్రెయిడ్, గజరా హెయిర్‌స్టైల్ వంటి స్టైలిష్ లుక్స్ తప్పకుండా అందరికీ నచ్చుతాయి.

summer wedding hairstyles saree lehenga easy looks in telugu
వెడ్డింగ్స్ కోసం ప్రత్యేకం

వేసవి కాలంలో జరిగే పెళ్లిళ్లలో ప్రత్యేకంగా, స్టైలిష్‌గా కనిపించాలంటే.. ఇలా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లా ప్రయత్నించండి. చెమట పట్టకుండా ఉండాలంటే ఈ హెయిర్‌స్టైల్‌పై దృష్టి పెట్టాలి. చీర కట్టుకుంటే సింపుల్ బ్రెయిడ్ వేసుకోండి. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 

మెస్సీ బ్రెయిడ్ విత్ హెయిర్ ఎక్సెసరీస్

చీర సింపుల్‌గా ఉంటే హెయిర్‌స్టైల్ హెవీగా ఉండాలి. ఓపెన్ హెయిర్ కాకుండా రష్మీ దేశాయ్ లాగా మెస్సీ బ్రెయిడ్ వేసుకోవచ్చు. దీనికి కాస్త సమయం, ఓపిక కావాలి. కానీ ఒక్కసారి అది పూర్తైతే అందరి చూపూ మీపైనే పడటం ఖాయం. లుక్ మాత్రం అదిరిపోతుంది. జడ వేయడం పూర్తయ్యాక హెయిర్ ఎక్సెసరీస్ వాడటం మర్చిపోకండి.


ఫిష్ టెయిల్ బ్రెయిడ్

ఫిష్ టెయిల్ బ్రెయిడ్ క్యాజువల్ అవుట్‌ఫిట్‌తోనే బాగుంటుందని అమ్మాయిలు అనుకుంటారు. కానీ ఇది సల్వార్ సూట్‌కి కూడా మినిమల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోండి. ఇది లుక్‌ని పెంచడంతో పాటు స్టైల్‌గా కూడా ఉంటుంది.

గజరా హెయిర్‌స్టైల్

గజరా హెయిర్‌స్టైల్ చాలా బోల్డ్ లుక్ ఇస్తుంది. చెమటతో ఇబ్బంది పడుతుంటే ఓపెన్ హెయిర్ ఇబ్బందిగా ఉంటే దీన్ని ప్రయత్నించవచ్చు. రోలర్ సహాయంతో జుట్టుని ముడి వేసి గజరా లేదా పువ్వులతో అలంకరించుకోవచ్చు. ఈ స్టైల్ కి రాణి ముఖర్జీ అంబాసిడర్.

సైడ్ బన్ హెయిర్‌స్టైల్

లెహంగా-చీరతో బోల్డ్ బ్లౌజ్ వేసుకుంటే జుట్టు విరబోసుకోవద్దు. ఇది లుక్ మొత్తం పాడు చేస్తుంది. చీర-లెహంగాకి వింటేజ్ లుక్ ఇస్తూ సైడ్ బన్ వేసుకోవచ్చు. సన్నగా ఉన్న అమ్మాయిలకు ఇది బాగా నప్పుతుంది. ఆధునికంగానూ కనిపిస్తుంది.

Latest Videos

vuukle one pixel image
click me!