సిలిండర్ ని ఉంచే ప్రదేశం...
గ్యాస్ వాసన కొనసాగితే, రెగ్యులేటర్‌ను తీసివేసి సిలిండర్‌పై సేఫ్టీ క్యాప్‌ను ఉంచండి. పిల్లలను గ్యాస్ ప్రాంతం దగ్గర అనుమతించవద్దు. సిలిండర్‌ను ఎక్కువసేపు ఉపయోగించకూడదనుకుంటే, రెగ్యులేటర్‌ను తీసివేసి దానిపై క్యాప్‌ను ఉంచండి. సిలిండర్‌ను పొడి ప్రదేశంలో నిల్వ చేయండి.
వీటిని దూరంగా ఉంచాలి...
మీకు గ్యాస్ వాసన వస్తే, సమీపంలోని ఏవైనా మంటలు, కొవ్వొత్తులు, అగరుబత్తులు, దీపాలు లాంటివి ఉంటే వాటిని వెంటనే ఆర్పివేయండి. అగ్గిపుల్లలు లేదా లైటర్లను వెలిగించవద్దు. విద్యుత్ స్విచ్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయకుండా జాగ్రత్త వహించండి, ఎందుకంటే అవి స్పార్క్‌లను కలిగించి పెద్ద పేలుడుకు కారణమవుతాయి.
సిలిండర్ నుంచి మంటలు వస్తే...
గ్యాస్ లీకేజీ కారణంగా సిలిండర్ నుంచి మంటలు వస్తే మీరు వెంటనే భయపడవద్దు. సిలిండర్ మంటల్లో చిక్కుకుంటే, మీకు కొంత సమయం ఉంది. సిలిండర్ మంటల్లో చిక్కుకుంటే, మందపాటి దుప్పటిని తడిపి, ఆపై సిలిండర్ చుట్టూ చుట్టండి. ఇది మంటలను ఆపివేస్తుంది. దీని తరువాత, వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 1906 కు కాల్ చేయండి.