Tickle children: పిల్లలకు చక్కిలిగింతలు పెట్టడం ఎంత డేంజరో తెలుసా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

Published : Nov 24, 2025, 12:48 PM IST

Tickle children: పిల్లల్ని నవ్వించేందుకు ఎంతోమంది కితకితలు పెడుతుంటారు. ఇలా చక్కిలిగింతలు పెట్టడం వారికి ఏమాత్రం ఆరోగ్యకరంక కాదు. వైద్యులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. 

PREV
14
చక్కిలిగింతలు వద్దు

పిల్లలను నవ్వించేందుకు ఎంతోమంది తల్లిదండ్రులు చేసే పని కితకితలు పెట్టడం. చక్కిలిగింతలు పెట్టడం వల్ల వారికి నవ్వు రావచ్చు...కానీ వారి ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదు. చిన్నారులు తరచూ నవ్వడం వల్ల వారు ఆనందంగా కనిపించడంతో ఇది సరదాగా అనిపిస్తుంది. అయితే వైద్యులు చెబుతున్న ప్రకారం వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం చక్కిలిగింతలను సరదాగా తీసుకోవద్దని అంటున్నారు. బయటకు పిల్లలు నవ్వుతున్నా లోపల వారు మాత్రం అసహజం, భయంగా ఫీలవుతారు. వారిలో ఒత్తిడి పెరిగిపోతుంది. ముఖ్యంగా చిన్న వయస్సులో పిల్లలకు ఇలా తరచూ చక్కిలిగింతలు పెట్టడం వల్ల వారు తమ భావాలను మాటల్లో చెప్పలేరు. ఆ సామర్థ్యం వారిలో తగ్గిపోతుంది.

24
పిల్లల్లో ఒత్తిడి పెరిగిపోతుంది

వైద్యుల చెబుతున్న ప్రకారం కితకితలు అనేవి పిల్లల శరీరానికి, మనసుకు ఒత్తిడిని కలిగిస్తుంది. అకస్మాత్తుగా శరీరంలో అసహజమైన భావాలు కలుగాయి. చక్కిలిగింతలు పెట్టేటప్పుడు వచ్చే నవ్వు నిజంగా సరదా కాదు అది ప్రతిచర్య మాత్రమే. పిల్లలు కితకితలు వద్దని ఆపమని చెప్పినా పెద్దలు ఆపకుండా ఇంకా బలవంతంగా నవ్వించడానికి ప్రయత్నిస్తారు. ఇది పిల్లల్లో కొన్ని విషయాలపై నియంత్రణ కోల్పోయిన భావన వారిలో కలుగుతుంది. తమ శరీరంపై తమ కంట్రోల్ లేదని భావించే పరిస్థితి రావచ్చు. ఇది దీర్ఘకాలంలో వారి ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత భద్రత భావనపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు.

34
శ్వాస సమస్యలు వచ్చే ఛాన్స్

కొందరు చిన్నారులకు చక్కిలిగింతలు అనేవి శ్వాసకోశ సమస్యలు రావడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు నవ్వుతున్నట్టు కనిపించినా ఆ నవ్వు శరీరంపై పడే ఒత్తిడికి వచ్చే ప్రతిస్పందనగానే చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో పిల్లలు శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడవచ్చు. వారికి ఎక్కువసేపు చక్కిలిగింతలు పెట్టితే హార్ట్‌రేట్ పెరగడం, శరీరం టెన్షన్‌లోకి వెళ్లడం జరుగుతుందని శిశు వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల అభివృద్ధి దశలో ఉన్నప్పుడు ఇలాంటి ఒత్తిడి మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది శారీరకంగా, భావోద్వేగపరంగా ఎంతో చెడు ప్రభావం చూపిస్తుంది.

44
పిల్లల మనసులో బాధ

వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారంనమ్మకం పెరిగే కితకితలు వద్దని చెబుతున్నా పెద్దవారు పెడతూ ఉంటే పిల్లల్లో ఒకరకమైన నెగిటివ్ భావన కలుగుతుంది. తాము వద్దు అని చెప్పినా పెద్దలు కొనసాగిస్తే పిల్లల మనసులో తాము చెప్పిన మాటకు విలువ లేదని అనకుంటారు. కాబట్టి దీని వల్ల పిల్లల్లో అసౌకర్యం పెరిగిపోతుంది. పిల్లలు వద్దు అని చెప్పగానే ఆపేయాలి.

వైద్యులు చెబుతున్న ప్రకారం పిల్లలు నవ్వేలా చేయడానికి చక్కిలిగింతలు అవసరం లేదు. వారిని ఆడించడం, కథలు చెప్పడం, పజిల్స్, సృజనాత్మక ఆటలు, డాన్స్, చిన్న చిన్న గేమ్స్ వంటివి వారితో చేయించవచ్చు. వీటితో పిల్లలు నవ్వడం, ఆడుకోవడం సహజమైన సానుకూల భావాలు పెరుగుతాయి.పిల్లలకు చక్కిలిగింతలు పెట్టడం తల్లిదండ్రులు భావించేంత సరదా పని కాదు అని వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. పిల్లల భద్రత, భావోద్వేగ ఆరోగ్యం ఈ పనిని పూర్తిగా మానేయడం మంచిదని సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories