ఇందుకోసమే బెండకాయ నీటిని రోజూ తాగమని చెప్తుంటారు..

First Published Jan 10, 2023, 3:58 PM IST

బెండకాయలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. మీ డైలీ డైట్ లో బెండకాయ నీటిని చేర్చితే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అందుకే..
 

ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన ఆహారాలను, పానీయాలను తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. పసుపు, దాల్చినచెక్క, నిమ్మరసం, మెంతులు వంటి సుగంధ ద్రవ్యాలతో కూడిన పానీయాలను తయారుచేసి క్రమం తప్పకుండా తాగే వారున్నారు. వీటివల్ల దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ పానీయాల లాగే బెండకాయ నీరు కూడా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ కూరగాయలు సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయి. బెండకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బెండకాయలోని పోషకాలను పొందడానికి ఉత్తమ మార్గం బెండకాయ నీరు. బెండకాయ నీటిని తాగడం వల్ల బరువు తగ్గడం నుంచి రోగనిరోధక  శక్తి పెరగడం వరకు ఎన్నో ఆరకోగ్య ప్రయోజనాలను పొందుతారు. 

బెండకాయ నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

బెండకాయ నీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బెండకాయ వాటర్ ను తాగడం వల్ల కలిగే కొన్ని ప్రధాన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

బరువు తగ్గుతారు

బెండకాయలో విటమిన్ బి, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ బెండకాయ వాటర్ మీ ఆకలిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇది బరువును తగ్గించడంలో మరింత ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు  పానీయం మీరు హైడ్రేటెడ్ గా ఉండటానికి, జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుంది.
 

మధుమేహాన్ని నియంత్రిస్తుంది

బెండకాయలో కరిగే, కరగని ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి భోజనం నుంచి కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేస్తాయి. అలాగే జీర్ణక్రియను ఆలస్యం చేస్తాయి. అంతేకాదు భోజనం చేసిన తర్వాత వచ్చే సమస్యలను, ఆకలి బాధలను తగ్గిస్తాయి. 
 

రోగనిరోధక శక్తి  పెరుగుతుంది

బెండకాయలో ఫ్లేవనాయిడ్లు లేదా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ సమ్మేళనాలు శరీరానికి హానికలిగించే ఫ్రీ రాడికల్స్ నష్టానికి వ్యతిరేకంగా పోరాడుతాయని ఎన్నో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది మీ మొత్తం రోగనిరోధక వ్యస్థను మరింత మెరుగుపరుస్తుంది. 

గుండె ఆరోగ్యానికి మంచిది

పలు అధ్యయనాల ప్రకారం.. బెండకాయ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి  సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది ఎన్నో ఆరోగ్య సంబంధిత సమస్యల ప్రమాదాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 
 

చర్మ ఆరోగ్యానికి మంచిది

బెండకాయలో అధిక స్థాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడానికి, విషాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఈ కారకాలు చర్మం వృద్ధాప్య ప్రక్రియను మందగించడానికి ఎంతో సహాయపడతాయి. అలాగే చర్మం పై మచ్చలను, చికాకును తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
 

ప్రతిరోజూ ఓక్రా నీరు త్రాగటం మంచిదేనా? 

బెండకాయ నీరు తాగడానికి సరైన సమయం ఎప్పుడు: బెండకాయ నీటిని రోజూ తాగొచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బెండకాయ నీటిని తాగడానికి ఉత్తమ సమయం ఉదయం ఖాళీ కడుపున. ఇది సురక్షితమైనది. ప్రభావవంతమైంది కూడాను. 
 

click me!