యాంటీ మేకప్ ఫోర్స్ అంటూ... షోలో పాల్గొన్న అమ్మాయిల మేకప్స్ కి వ్యతిరేకంగా మాట్లాడారు కార్తికేయ. తెలుగు భాషలో నాకు నచ్చని పదం మేకప్ అన్నాడు. అది తెలుగు పదం కాదని సుమ పంచ్ వేసింది. పక్కనే ఉన్న ఐశ్వర్య గట్టిగా నవ్వేసింది. ఐశ్వర్యను ఉద్దేశిస్తూ... మేకప్ ఆమె వేసుకోవడం కాదు, మేకప్ ఆమెను వేసుకుందని కార్తికేయ అన్నాడు.