Jaggery: బెల్లం, పల్లీలు, నెయ్యి కలిపి తింటే షుగర్ క్రాష్ లేని ఎనర్జీ, జీర్ణం, ఇమ్యూనిటీ, బోన్ సపోర్ట్ వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఇది తగిన మోతాదులో తినడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
పల్లీలు, బెల్లం, నెయ్యి కాంబో తింటే షుగర్ క్రాష్ ఉండదా? అసలు మ్యాజిక్ ఇదే
కొంతమందికి స్వీట్ తినగానే కాసేపటికి ఎనర్జీ డౌన్ అయ్యే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ బెల్లం, పల్లీలు, నెయ్యి కలిపి తింటే అలాంటి సడన్ షుగర్ క్రాష్ రాకుండా నిలకడగా ఎనర్జీ అందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది బేసిక్‌గా మనం తినే పల్లీ చిక్కీ లేదా లడ్డుకు దగ్గరగా ఉండే ట్రెడిషనల్ కాంబినేషన్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ICMR-NIN) వారి ఇండియన్ ఫుడ్ కంపోజిషన్ టేబుల్స్ (IFCT), అంతర్జాతీయ పోషకాహార పరిశోధనల ప్రకారం.. బెల్లం, పల్లీలు, నెయ్యిలలో మనుషులకు అవసరమైన పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు ఉన్నాయి.
స్వీట్, సాల్టీ, నట్టీ టేస్ట్ కలిపి సూపర్ గా ఉంటుంది. ఇందులో పల్లీల నుంచి ప్రోటీన్, మోనోఅన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ వస్తాయి. నెయ్యి వల్ల హెల్తీ సాచురేటెడ్ ఫ్యాట్స్ అందుతాయి. ఈ రెండూ కలిసి బెల్లంలోని నేచురల్ షుగర్స్ రక్తంలో నెమ్మదిగా శోషించబడేలా చేస్తాయి. దాంతో ఇన్సులిన్ ఒక్కసారిగా పెరిగి పడిపోయే పరిస్థితి తగ్గి, రోజంతా బ్యాలెన్స్‌డ్ ఎనర్జీ లభిస్తుంది.
25
జీర్ణక్రియ, గట్ హెల్త్‌కు మంచి సపోర్ట్
కడుపు ఉబ్బరం లేదా డైజెషన్ ఇబ్బందులు ఉన్నవారికి ఈ కాంబినేషన్‌లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. బెల్లం డైజెస్టివ్ ఎంజైమ్స్‌ను ప్రేరేపిస్తుంది, అలాగే జీర్ణవ్యవస్థను క్లియర్ చేయడానికి తోడ్పడుతుంది. మరోవైపు నెయ్యిలో బ్యూటిరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పేగుల కణాలకు పోషణ అందించి, బౌల్ మూవ్‌మెంట్స్ సులభంగా జరిగేలా చేస్తుంది. పల్లీలు తిన్నప్పుడు కొంత హెవీగా అనిపించే గుణాన్ని నెయ్యి బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా బెల్లం, పల్లీలు, నెయ్యి కలిసి గట్ హెల్త్‌కు మంచి సపోర్టు ఇస్తాయి.
35
ఐరన్ శోషణ, ఇమ్యూనిటీ బూస్ట్
ఈ మూడు పదార్థాలు కలిసినప్పుడు మినరల్స్, విటమిన్స్ పరంగా ఒక మంచి కాంబినేషన్ ఏర్పడుతుంది. బెల్లంలో నాన్ హీమ్ ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. పల్లీల ద్వారా జింక్, విటమిన్ ఇ, బీ విటమిన్స్ లభిస్తాయి. ఇక నెయ్యి విషయానికి వస్తే, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అయిన విటమిన్ ఎ, డి, ఇ, కె శరీరంలో బాగా శోషించుకోవడానికి సహాయపడుతుంది. అలాగే సెల్ మెంబ్రేన్స్ ద్వారా పోషకాలు రవాణా కావడానికి కూడా నెయ్యి తోడ్పడుతుంది. దీనివల్ల ఇమ్యూనిటీ, ఓవరాల్ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ మెరుగుపడతాయి.
ఎముకలు, కీళ్ల బలానికి అవసరమైన పోషకాలు కూడా ఈ మిశ్రమంలో కనిపిస్తాయి. నెయ్యి కీళ్లకు లూబ్రికేషన్ లాగా పనిచేస్తూ, కాల్షియం శోషణకు సపోర్ట్ చేస్తుంది. అదే సమయంలో పల్లీలు, బెల్లంలో ఉండే ఫాస్పరస్, మెగ్నీషియం, ప్రోటీన్ ఎముకల దృఢత్వానికి, కండరాల రికవరీకి ఉపయోగపడతాయి. రోజూ యాక్టివ్‌గా ఉండేవారికి ఇది మంచి పోషక కలయికగా నిలుస్తుంది.
55
పోర్షన్ కంట్రోల్ ఎందుకు ముఖ్యం?
ఇన్ని లాభాలు ఉన్నా, ఈ కాంబినేషన్‌ను ఎంత మోతాదులో తింటున్నామనేదే అసలు పాయింట్. బెల్లం, పల్లీలు, నెయ్యి మూడూ క్యాలరీ డెన్స్ ఫుడ్స్. ఒక చిన్న లడ్డు లేదా రెండు టేబుల్‌స్పూన్‌ల సర్వింగ్‌లో దాదాపు 150 నుంచి 180 క్యాలరీలు ఉంటాయి. అందుకే మోడరేషన్ చాలా అవసరం. ఎక్కువగా తింటే బ్లోటింగ్, ఎసిడిటీ లేదా అవాంఛిత బరువు పెరగడం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఇందులో హెల్తీ ఫ్యాట్స్ ఉన్నప్పటికీ బెల్లం పోర్షన్‌ను లిమిట్ చేసుకోవడం తప్పనిసరి. లాభాలు, లిమిట్స్ రెండూ ఉన్నాయనే విషయాన్ని మర్చిపోకండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ అవగాహన, పోషకాహార వివరాల కోసం మాత్రమే. ఇది వైద్య సలహా లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. బెల్లం, పల్లీలు, నెయ్యి కలిపి తయారు చేసిన ఆహారం తినాలనుకుంటే ముఖ్యంగా మధుమేహం, అలర్జీలు, బరువు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగా వైద్యులు లేదా న్యూట్రిషనిస్టులను సంప్రదించడం మంచిది.