Buffalo Price: రెండు అడుగుల గేదె ధర ఏకంగా రూ.1కోటి..? ఏంటి.. ఈ గేదెలో స్పెషాలిటీ..?

Published : Nov 27, 2026, 04:38 PM IST

Buffalo Price: ఒక గేదె ధర మహా అంటే ఎక్కువలో ఎక్కువ రూ.లక్ష ఉంటుంది. కానీ, కోటి రూపాయలు పలికే గేదె ఒకటి ఉందని తెలుసా? ఈ గేదె ని చూడటానికి ఇప్పుడు చాలా మంది క్యూలు కడుతున్నారు. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

PREV
12
సోషల్ మీడియా స్టార్ ఈ గేదె

సాధారణంగా పశువుల సంత అనగానే భారీగా ఉండే ఒంటెలు, ఆజానుబాహువు లాంటి గుర్రాలు, ఆకట్టుకునే ముర్రా జాతి గేదెలు గుర్తొస్తాయి. కానీ, రాజస్థాన్ లోని ప్రఖ్యాత పుష్కర్ మేళాలో మాత్రం ఒక బుల్లి గేదె అందరి చూపునూ తనవైపు తిప్పుకుంటోంది. కేవలం 2 అడుగుల ఎత్తులో మాత్రమే ఉన్న ఈ గేదెకు ఎందుకు ఇంత క్రేజ్..? ఇంతకీ ఈ గేదెలో స్పెషాలిటీ ఏంటి?

రెండు అడుగుల గేదె..

సోషల్ మీడియాలో మొత్తం విపరీతంగా ట్రెండ్ అయిన ఈ గేదె పేరు పింకీ. దీని ఎత్తు కేవలం రెండు అడుగులు మాత్రమే కావడం విశేషం. మహారాష్ట్రలోని థానేకు చెందిన యజమాని తన ముద్దుల గేదె పింకీ ని తీసుకొని సుమారు 1,100 కిలోమీటర్లు ప్రయాణించి రాజస్థాన్ లోని పుష్కర్ మేళాకు వచ్చారు. మేళాకు వచ్చిన సందర్శకులు భారీ పశువులను కాదని, చిన్న పిల్లల ఎత్తులో ఉన్న పింకీ చుట్టే అందరూ గుమ్మిగూడటం విశేషం. ముఖ్యంగా చిన్నపిల్లలు తమ ఎత్తులో ఉన్న ఈ బుల్లి గేదె తో సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ తెగ సందడి చేశారు.

22
పింకీ గేదె ఇంత పొట్టిగా ఉండటానికి కారణం ఏంటి?

పింకీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన మినియేచర్ జాతికి చెందినది కాదు, సహజసిద్ధంగానే ఇలా పొట్టిగా పుట్టిందని తెలుస్తోంది. దీని తల్లి కూడా సుమారు మూడు అడుగుల ఎత్తు మాత్రమే ఉండి, రోజుకు రెండు లీటర్ల పాలు ఇచ్చేదట. ఇప్పటి వరకు పింకీ ఏ దూడకు జన్మనివ్వలేదు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి గేదె పింకీనే కావచ్చు అని దాని యజమాని భావిస్తారు. అయితే , దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వంటి సంస్థల నుంచి ఎలాంటి అధికారిక గుర్తింపు రాలేదు.

నిజంగానే పింకీ ధర రూ.1కోటి ఉంటుందా?

పింకీ ఎత్తుతో పాటు దాని ధరపై కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలలో పింకీ విలువ రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, దీని అసలు మార్కెట్ ధర ఎంతనే దానిపై యజమాని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, నెట్టింట మాత్రం ఆ గేదె ధర రూ. కోటి అంటూ ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఇప్పుడు.. ఈ బుజ్జి గేదె.. సోషల్ మీడియాలో స్టార్ గా మారిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories