Cucumber: మనం రోజూ తినే సాధారణ ఆహారాల్లో అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉంటాయి. అలాంటి వాటిలో ముఖ్యమైంది కీరదోస. ఇందులో శరీరానికి అవసరమైన నీరు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నిపుణుల ప్రకారం రోజుకో కీరదోస తినడం వల్ల ఏ సమస్యలు తగ్గే అవకాశం ఉందో చూద్దాం
కీరదోస చాలా సింపుల్‌గా కనిపించే కూరగాయ అయినా, ఆరోగ్య పరంగా ఇది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇందులో దాదాపు 95 శాతం వరకు నీరు ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కీరదోసలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మంపై వచ్చే మచ్చలు, డల్ స్కిన్, పింపుల్స్ వంటి సమస్యలను తగ్గించడంలో కీరదోస ఎంతో సహాయపడుతుంది. రోజూ కీరదోస తినడం వల్ల చర్మం సహజంగా ఫ్రెష్‌గా, గ్లోయింగ్‌గా కనిపిస్తుంది.
25
గట్ హెల్త్ కి మేలు
కీరదోసలో ఉండే ఫైబర్ గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. చాలామంది డాక్టర్లు సహజమైన ఫైబర్ కోసం కీరదోసను తినమని చెబుతుంటారు. కీరదోస జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపు ఉబ్బరం సమస్యను తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది.
35
బరువు తగ్గడానికి
బరువు తగ్గాలనుకునే వారికి కీరదోస చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది తక్కువ కేలరీలు కలిగి ఉండటంతో పాటు ఎక్కువ సేపు పొట్ట నిండిన భావన ఇస్తుంది. దీనివల్ల ఎక్కువగా తినే అలవాటు తగ్గుతుంది. నార్మల్ స్నాక్స్‌కు బదులుగా కీరదోస ముక్కలు తీసుకుంటే హెల్తీగా ఉండటమే కాకుండా బరువు కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కీరదోస ఒక సహజ డిటాక్స్ ఫుడ్‌గా పనిచేస్తుంది. రోజూ కీరదోస తినడం వల్ల కిడ్నీ ఫంక్షన్ మెరుగుపడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది యూరిన్ ప్రొడక్షన్‌ను ప్రోత్సహిస్తుంది. అయితే కీరదోస ఎక్కువగా తినడం కూడా మంచిదికాదు. కొంతమందికి గ్యాస్ లేదా జీర్ణ సమస్యలు రావచ్చు. కాబట్టి మితంగా తీసుకోవాలి.
55
బీపీ కంట్రోల్
గుండె ఆరోగ్యానికి కూడా కీరదోస మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. హై బీపీతో బాధపడేవారికి ఇది సహజ ఆహారంగా పనిచేస్తుంది. అయితే, ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.