సోఫా లేదా టేబుల్ కవర్ గా వాడేయండి..
మీ దుప్పటి.. వెలిసిపోకుండా కాస్త చినిగినట్లు మీకు అనిపిస్తే.. దానిని మీరు సోఫా కవర్ గా లేదా డైనింగ్ టేబుల్ కవర్ గా లేదా డోర్ మ్యాట్ లాగా వాడొచ్చు. పండగల సమయంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు.. ఇంట్లో సోఫాలు, డైనింగ్ టేబుల్స్ పై దుమ్ము పడకుండా ఉండాలంటే ఈ పాత దుప్పట్లు కప్పి ఉంచొచ్చు.
పాత దుప్పటితో కర్టెన్లు...
మీ లివింగ్ రూమ్ లేదా స్టోర్ రూమ్ కోసం కర్టెన్లు కూడా పాత దుప్పటిని ఉపయోగించొచ్చు. తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా మార్చేయచ్చు.
పిల్లలు ఆడుకొనేటప్పుడు మ్యాట్ గా..
రెండు, మూడు పాత దుప్పట్లు అన్నీ కలిసి ఒక బొంతలా కుట్టేయండి. దానిని మీరు పిల్లలు ఆడుకొనేటప్పుడు కింద పరిస్తే.. దాని మీద వాళ్లు ఆడుకుంటారు. పిక్నిక్ లాగా చిన్న టూర్ కి వెళ్లినప్పుడు దీనిని వెంట క్యారీ చేయవచ్చు.
ఎలక్ట్రానిక్స్ కోసం డస్ట్ కవర్లను తయారు చేయండి
మీ టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్యాన్లు, కంప్యూటర్ లేదా చాలా కాలంగా ఉపయోగించని ఏదైనా ఫర్నిచర్‌ను కప్పడానికి దుప్పట్లను ఉపయోగించవచ్చు. ఇది దుమ్ము పేరుకుపోవడాన్ని తగ్గించి, వస్తువులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.