Telugu saying: జీవితంలో ఏ అనుభవం లేని వ్యక్తికి, బడాయిపోయేవాళ్లకు ఈ సామెత కరెక్టుగా సరిపోతుంది. చిన్న విషయానికే ఏదో జరిగిపోయినట్లు, పెద్ద వింత అన్నట్లు బిల్డప్ ఇచ్చేవాళ్లకు ఈ సామెతతో వెటకారంగా చెప్తారు.
ఈ సామెత వెనుక ఒక చిన్న కథ చెప్పొచ్చు. ఒక అడవిలో ఒక నక్క పిల్ల పుట్టి కేవలం నాలుగు వారాలు మాత్రమే అయ్యింది. దానికి ఇంకా ప్రపంచం గురించి ఏమీ తెలియదు. అప్పుడప్పుడే గుహలోంచి బయట ప్రపంచాన్ని చూస్తోంది. అలాంటి సమయంలో ఒకరోజు అడవిలో గాలివాన వచ్చింది.నిజానికి అది పెద్ద తుపాను ఏమీ కాదు, సహజంగా వచ్చే వాన. కానీ, ఆ నక్క పిల్లకు అంతకుముందు వానలు చూసిన అనుభవం లేదు కాబట్టి, అది భయపడిపోతూ.. తన జీవితంలో ఇంత పెద్ద గాలివానను నేనెప్పుడూ చూడలేదని పెద్ద డైలాగ్ కొట్టిందట. ఇక్కడ చమత్కారం ఏంటంటే.. దాని వయసే నాలుగు వారాలు, ఇక అది తన జీవితంలో చూడకపోవడంలో పెద్ద వింతేముంది? .
23
ఈ జనరేషన్ వాళ్లకి సరిపోతుంది
ఇప్పుడున్న జనరేషన్ లో ఉన్నవాళ్లకు ఇది సరిపోతుంది. ఉద్యోగాలు, ఆఫీసులో అడుగుపెట్టి ఆరు నెలలు కూడా కాకుండానే, కంపెనీ స్ట్రాటజీల గురించి, మేనేజ్‌మెంట్ లోపాల గురించి గంటల తరబడి లెక్చర్లు ఇస్తుంటారు. చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ నాలుగు లైకులు రాగానే..సెలబ్రిటీల్లాగా ఫోజులిస్తుంటారు.
33
అనుభవం ఉండాలి
అనుభవం అనేది వయసుతో, కాలంతో వస్తుంది. చిన్న విషయాలకే అతిగా స్పందిస్తూ, సర్వజ్ఞులం అనుకునే వారికి, గొప్పలు పోయేవారికి ఈ సామెత సరిపోతుంది.