బరువును తగ్గించే చిట్కాలు: ఆకలి తగ్గాలంటే వీటిని తినండి..

First Published Aug 20, 2022, 4:58 PM IST

బరువును తగ్గించే చిట్కాలు:  నోటిని అదుపులో పెట్టుకుంటే శరీర బరువు సులువుగా అదుపులోకి వస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే విపరీతమైన ఆకలి ఇట్టే తగ్గిపోతుంది. 
 

మనం తినే ఫుడ్ పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఫుడ్ అత్యవసరం అయినప్పటికీ.. మోతాదుకు మించి తింటే లేనిపోని తిప్పలొచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఓవర్ గా తినడం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు. ఇలా తినడానికి కూడా ఓ కారణం ఉంది. అదే అతిగా ఆకలి అవడం. ఇలాంటి వారికి ఎంత తిన్నా కడుపు నిండనట్టుగానే అనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ తింటూనే ఉంటారు. ఇది కాస్త బరువు పెరగడానికి దారితీస్తుంది. అంతేకాదు ఎన్నో రోగాలకు కారణమవుతుంది. 

మీరు కూడా అతిగా ఆకలేసే సమస్యను ఫేస్ చేస్తున్నట్టైతే ఈ ఫుడ్స్ ను తినండి. ఇవి మీ ఆకలిని నియంత్రించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటో చూద్దాం పదండి.. 

బాదం

బాదం పప్పుల్లో మెగ్నీషియం, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పప్పులు మీ ఆకలిని తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. వీటిని తినడం వల్ల మీ కడుపు తొందరగా నిండుతుంది. అలాగే ఎక్కువ సేపు కడుపు నిండుగానే ఉందన్న అనుభూతి వస్తుంది.
 

కొబ్బరి

కొబ్బరి కూడా ఆకలిని నియంత్రిస్తుంది. దీన్ని తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇది మిమ్మల్ని అతిగా తినకుండా చేస్తుంది. అంతేకాదు ఇది మీ శరీర కొవ్వును, కేలరీలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 
 

మొలకెత్తిన తెల్ల శెనగపప్పు

మొలకెత్తిన తెల్ల శెనగపప్పులో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. వీటిని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తింటే మంచిది. ఇవి ఆకలిని కలిగించే హార్మోన్ల స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.
 

మజ్జిగ

మజ్జిగ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే దీన్ని ఎండాకాలంలో ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఇది ఆకలిని తగ్గించడానికి కూడా సహాయపడుతుందన్న ముచ్చట మీకు తెలుసా.. ఆకలిగా ఉన్నప్పుడు కొంచెం మజ్జిగ తాగితే మీ  కడుపు ఫుల్ అవుతుంది. వేరేవి తినాలన్న కోరిక కూడా పోతుంది. నిజానికి మజ్జిగ ఆకలిని తీర్చే పానీయం కూడా.  దీనిలో కాల్షియం, ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి.
 

కూరగాయల రసాలు, అవిసె గింజలు

ఆకలిని తగ్గించేందుకు కొన్ని రకాల కూరగాయల రసాలు, అవిసె గింజలు ఎంతో సహాయపడతాయి. వీటిలో ఆకలిని అదుపులో ఉంచే ఫైబర్ తో పాటుగా యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇక అవిసె గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులకు ఏ కొదవా ఉండదు. 

click me!