Foods for Better Sleep: రాత్రి హాయిగా నిద్రపట్టాలా? ఈ ఫుడ్స్ తింటే చాలు, హ్యాపీగా నిద్రపోతారు!

Published : May 26, 2026, 04:16 PM IST

Foods for Better Sleep: ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర ఎంత ముఖ్యమో మనకు తెలుసు. కొన్ని రకాల ఫుడ్స్ శరీరాన్ని, మెదడును రిలాక్స్ చేసి ప్రశాంతమైన నిద్రకు సహాయపడతాయి. ముఖ్యంగా నిద్రలేమితో బాధపడేవారికి ఈ ఫుడ్స్ వరంగా చెప్పుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా..

PREV
16
మంచి నిద్రకు సహాయపడే పుడ్స్

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిద్రలేమి ఒకటి. పని ఒత్తిడి, మొబైల్ వాడకం, టెన్షన్, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, ఇతర కారణాలతో రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే మంచి నిద్ర కోసం మందులపై ఆధారపడటం కంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.  కొన్ని సహజ ఆహార పదార్థాలు శరీరానికి విశ్రాంతి కలిగించి, మెదడును ప్రశాంతంగా ఉంచి నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయట. అలాంటి పుడ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

26
గుమ్మడి గింజలు

మంచి నిద్రకు సహాయపడే అత్యుత్తమ సహజ ఆహారాల్లో గుమ్మడి గింజలు ఒకటి. వీటిలో మెగ్నీషియం, జింక్, ట్రిప్టోఫాన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్ల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇవే మన నిద్ర చక్రాన్ని నియంత్రించే ప్రధాన హార్మోన్లు. నిపుణుల ప్రకారం రాత్రి పడుకునే ముందు కొద్దిగా గుమ్మడి గింజలు తింటే మెదడు ప్రశాంతంగా మారి నిద్ర త్వరగా పట్టే అవకాశం ఉంటుంది.

36
పాలకూర

పాలకూర కూడా నిద్ర నాణ్యతను మెరుగుపరచే ఆహారాల్లో ఒకటి. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం మెదడులో మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే పాలకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఒత్తిడిని తగ్గించి మెదడును ప్రశాంతంగా ఉంచుతాయి. నిపుణుల ప్రకారం రాత్రి భోజనంలో పాలకూరతో చేసిన వంటకాలు చేర్చుకుంటే నిద్ర నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది.

46
డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ ని సరైన పరిమాణంలో తీసుకుంటే నిద్రకు ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇందులో మెగ్నీషియం, సెరోటోనిన్ స్థాయిలను ప్రభావితం చేసే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. అయితే డార్క్ చాక్లెట్‌లో కొంత కెఫిన్ ఉండే అవకాశం ఉన్నందున చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు

56
బాదం పప్పులు

బాదం పప్పులు కూడా నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. బాదంలో మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం శరీరంలోని నరాల వ్యవస్థను ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు నాలుగు లేదా ఐదు బాదం పప్పులు తింటే శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

66
అరటి పండ్లు

అరటి పండ్లు కూడా సహజ నిద్ర మాత్రలుగా పనిచేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6 వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి కండరాలను సడలించి శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి. ముఖ్యంగా విటమిన్ B6 శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. సెరోటోనిన్ మెదడుకు రిలాక్సేషన్ సంకేతాలు పంపి నిద్రను ప్రోత్సహిస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం ఈ ఆహారాలు మాత్రమే కాదు, సరైన నిద్ర అలవాట్లు కూడా చాలా అవసరం. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, పడుకునే ముందు మొబైల్ లేదా టీవీ వాడకాన్ని తగ్గించడం, రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లు పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories