1.దైవ అనుగ్రహం...
వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లో తులసి మొక్క దానంతట అదే పెరిగితే మీపై దైవానుగ్రహం ఉందని అర్థం. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని అర్థం. సంతోషంగా ఉన్న ఇంట్లో మాత్రమే తులసి మొక్క బాగా పెరుగుతుంది. అంతేకాదు.. ఆ మొక్క పెరిగే కొద్దీ మీ కుటుంబంలో సంతోషం, సంపద పెరుగుతాయని అర్థం
ఆర్థిక లాభం...
ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిక్కులో తులసి మొక్క పెరగడాన్ని ఆర్థిక పురోగతికి సంకేతంగా భావిస్తారు. అకస్మాత్తుగా మీ చేతికి డబ్బు రావడానికి సంకేతంగా భావిస్తారు. వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు.
కుటుంబంలో శుభవార్త..
మీ ఇంటి పెరట్లో తులసి మొక్క పెరిగితే.. త్వరలో మీరు శుభవార్త వినబోతున్నారని అర్థం. అంటే, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడమూ, బిడ్డ పుట్టడం లాంటివి జరిగే అవకాశం ఉంది.