హెయిర్ డై లేకుండానే.. తెల్లజుట్టును నల్లగా మార్చే టిప్స్..

First Published Apr 8, 2021, 4:34 PM IST

జుట్టు తెల్లబడటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఒకప్పుడు 50 దాటితే కానీ జుట్టు తెల్లబడకపోయేది. కానీ నేటి రోజుల్లో 30 ఏళ్ళకే ఇది మొదలైపోతుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం శరీరంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోవడమే. 

జుట్టు తెల్లబడటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఒకప్పుడు 50 దాటితే కానీ జుట్టు తెల్లబడకపోయేది. కానీ నేటి రోజుల్లో 30 ఏళ్ళకే ఇది మొదలైపోతుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం శరీరంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోవడమే.
undefined
జుట్టు రంగును మెరుపరచడానికి.. నల్లగా చేయడానికి మార్కెట్లో రకరకాల హెయిర్ డైలు, అనేక కంపెనీల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి జుట్టుకు హాని కలిగిస్తాయి.
undefined
మరి తెల్లజుట్టుకు పరిష్కారమే లేదా.. అంటే ఉంది. తెల్లజుట్టును సహాజంగా నల్లగా మారేలా చేసి.. లేదా అంత తొందరగా తెల్లగా అవ్వకుండా చేసే సహజపద్ధతులు కొన్ని ఉన్నాయి. ఇవి జుట్టుకు రంగుతో పాటు మంచి పోషణను కూడా అందిస్తాయి.
undefined
మరి తెల్లజుట్టుకు పరిష్కారమే లేదా.. అంటే ఉంది. తెల్లజుట్టును సహాజంగా నల్లగా మారేలా చేసి.. లేదా అంత తొందరగా తెల్లగా అవ్వకుండా చేసే సహజపద్ధతులు కొన్ని ఉన్నాయి. ఇవి జుట్టుకు రంగుతో పాటు మంచి పోషణను కూడా అందిస్తాయి.
undefined
బంగాళదుంప తోలు : బంగాళదుంపల్ని వండేముందు దాని పై తోలును పీలర్ తో తీసేసి పడేస్తుంటాం. అయితే దీన్ని అలా పడేయకూడదు. బంగాళదుంపల్లో అధికంగా పిండి పదార్థాలు ఉంటాయి. ఈ తోలులోని లక్షణాలే వాటిని లోపలే ఉండేలా కాపాడతాయి. అందుకే ఇది జుట్టుకు మంచి మందుగా కూడా పనిచేస్తుంది.
undefined
ఎలా తయారు చేయాలీ అంటే.. బంగాళాదుంపల పై తొక్కు తీసి వీటిని 2 కప్పుల నీటిలో ఉడకబెట్టండి. 10 నిమిషాల తరువాత స్టౌ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని దింపేయండి. పూర్తిగా చల్లారేదాకా పక్కన పెట్టండి. ఆ తరువాత బాగా కలిపి జుట్టుకు పట్టించండి. అరగంట తరువాత చల్లటి నీటితో తలను శుభ్రం చేసుకోండి.
undefined
జుట్టు రంగును కాపాడే మరో అద్భుతమైన పదార్థం నెయ్యి. ఇది అందరి ఇళ్లలోనూ కామన్ గా ఉండేదే. జుట్టుకు మంచి పోషణను ఇవ్వడమే కాకుండా జుట్టు కోల్పోయిన సహజరంగును తిరిగి తెస్తుంది.
undefined
ఎలా చేయాలంటే.. దేశి ఆవు పాలతో చేసిన నెయ్యితో తలకు మసాజ్ చేయండి. ఒక గంట పాటు అలాగే వదిలేసి.. ఆ తరువాత శుభ్రంగా కడిగేయండి. మంచి ఫలితం కావాలంటే వారానికి రెండుసార్లు ఇలా చేయవచ్చు.
undefined
తెల్లజుట్టును కవర్ చేయడానికి ఉపయోగించే విజయవంతమైన డైయింగ్ ఏజెంట్ కాఫీ. దీన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రంగులో గణనీయమైన తేడా వస్తుంది, దీనివల్ల జుట్టు సహజంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
undefined
బాగా ముదురు రంగులో ఉండే విడి కాఫీ పొడిని తీసుకోండి. దీనికి ఎలాంటి ఫ్లేవర్స్ లేకుండా జాగ్రత్త పడండి. 100-150 మి.లీ నీటిలో 2-3 టేబుల్ స్పూన్ల కాఫీ పొడిని వేసి ఈ మిశ్రమాన్ని చిక్కగా ముదురు రంగు వచ్చేవరకు మరిగించండి. మెత్తటి మృధువైన మిశ్రమంలా అయ్యాక దించి, పక్కనపెట్టండి.ఈ మిశ్రమం చల్లారిన తరువాత జుట్టుకు పట్టించండి. దాదాపు 45 నిమిషాల పాటు జుట్టుకు పట్టించి ఆ తరువాత కడిగేయండి.
undefined
ఉసిరి : దీంట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు ఇది బాగా పనిచేస్తుంది. జుట్టుకు రంగును తెప్పించడానికి ఉత్తమమైన పదార్థం ఉసిరి. అంతేకాదు ఇది సురక్షితం కూడా. ఉసిరిలో అధిక స్థాయిలో మెలనిన్ జుట్టును తొందరగా తెల్లబడడాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి దోహదపడుతుంది.
undefined
ఎలా చేయాలంటే.. కొబ్బరి నూనెలో కొద్దిగా ఉసిరి పొడి కలపండి. ఒక పాత్రలో వేసి నూనె మరిగే వరకు వేడి చేయాలి. ఆ తరువాత స్టౌ మీదినుంచి దించేసి చల్లబడనివ్వాలి. చల్లబడిన తరువాత జుట్టుకు ఈ మిశ్రమాన్ని అప్లై చేసి 30-40 నిమిషాలు ఉండనివ్వండి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
undefined
ఈ సహజపద్ధతులు జుట్టును ఇంట్లోనే సులభంగా నలుపుగా మారేలా చేస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే రెడీమేడ్ హెయిర్ డైలలాగా వెంటనే ఫలితాలను ఇవ్వవు. కాస్త ఆలస్యం అవుతుంది.
undefined
click me!