విశాఖపట్నంలో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవే!

First Published Oct 30, 2021, 3:04 PM IST

ఆంధ్రప్రదేశ్ లో రెండవ అతిపెద్ద నగరం విశాఖపట్నం. విశాఖపట్నం అత్యంత సుందరమైన ప్రదేశాలతో, బీచ్ (Beach) లతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది భారత దేశ ప్రధాన సముద్ర రేవు (Seaport). ఇప్పుడు ఈ ఆర్టికల్ లో విశాఖ పట్టణంలోని కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
 

భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు (Port) విశాఖపట్టణం లో ఉంది. ఈ నగరము బంగాళా ఖాతం ఒడ్డున ఉంది. ఈ నగరంలోని సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలు (Hills), లోయలతో (Valleys) ఉంటుంది. ఇక విశాఖపట్టణంలోని కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

బొర్రా గుహలు: బొర్రా అంటే ఒరియా భాషలో రంధ్రం 
(Hole) అని అర్థం. విశాఖ పట్టణం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఈ గుహలు (Caves) ఉన్నాయి. విశాఖపట్టణం నుంచి బొర్రా గుహలు వరకు చేసే ప్రయాణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ (Viliyam King) ఈ గృహాలను కనుగొన్నారు. కొండలపై నుంచి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. ప్రకృతితో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలను (Caves) తప్పకుండా చూడవలసిన ప్రదేశం.  
 

అరకు లోయ: అరకులోయ (Araku valleys) విశాఖపట్టణానికి 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొండలతో, లోయలతో, ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. అరకు వెళ్లే ఇరువైపులా దట్టమైన అడవులు, అనంతగిరి కొండలలో కాఫీ తోటలు (Coffee plantation) ఎంతగానో పర్యాటకులను ఆకర్షిస్తాయి.
 

లంబ సింగి: ఇది విశాఖ పట్టణానికి సుమారు 100 కిలో మీటర్ల దూరంలో అటవీ (Forest) ప్రాంతంలో ఉంది. పగలంతా మంచు వర్షంలా కురుస్తుంది. చల్లని గాలులు, కాఫీ తోటల మధ్య మధురమైన అనుభూతిని ఇస్తుంది. దీన్ని ఆంధ్ర కాశ్మీర్ (Andra Kashmir) అని కూడా అంటారు. ఇది అందమైన  ప్రకృతి తో కూడిన గిరిజన ప్రాంతం (Tribal people).  
 

ఉడా పార్క్: ఈ పార్కు పచ్చగా, రంగుల పూలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. రామకృష్ణ బీచ్ (Ramakrishna  Beach) వద్ద 55 ఎకరాల విస్తీర్ణం లో ఏర్పడిన ఈ ఉద్యానవనం (Park) ప్రత్యేకంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది పర్యాటకులు తప్పక సందర్శించవలసిన పార్క్.

click me!