Travel: 40ఏళ్లు నిండేలోగా జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి వెళ్లి రావాలి

Published : Aug 28, 2025, 05:48 PM IST

మన దేశంలో అత్యంత అద్భుతమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్నింటిని 40 ఏళ్లలోపే చూసేయాలి.  ఆ వయసులో చూస్తేనే ఎక్కువ ఎంజాయ్ చేయగలరు.  

PREV
16
అందమైన ప్రదేశాలు..

ట్రావెలింగ్ ని ఇష్టపడేవారు మన చుట్టూ చాలా మందే ఉంటారు. మన దేశంలో కూడా అంత్యంత సుందరమైన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని స్నేహితులతో కలిసి వెళ్తేనే ఎంజాయ్ చేయగలం. కొన్ని జీవిత భాగస్వామితో, మరి కొన్ని కుటుంబంతో వెళ్తే ఆస్వాదించగలం. అయితే.. చాలా మంది వయసులో ఉన్నప్పుడు డబ్బు సంపాదించాలని.. ఖర్చు చేయకూడదని ఎక్కడికి వెళ్లకుండా ఉంటారు. తీరా.. చేతిలో డబ్బు ఉన్నప్పుడు ప్రయాణం చేయడానికి ఓపిక ఉండదు. అయితే.. భారతదేశంలో 30 నుంచి 40 ఏళ్ల  వయసు దాటేలోగా చూడాల్సిన కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. మరి, అవేంటో చూద్దామా…

26
మనాలి..

హిమాచల్ ప్రదేశ్‌లోని శిమ్లా , మనాలి జంటలకు.. స్నేహితులకు హాట్‌స్పాట్. ఇక్కడి మంచుతో కప్పబడిన శిఖరాలు, సోలాంగ్ వ్యాలీలో పారాగ్లైడింగ్, రోహ్తాంగ్ పాస్ రోడ్ ట్రిప్ , నైట్ వైబ్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వయసులో ఉన్నప్పుడే ఇక్కడికి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ ట్రిప్ పెళ్లైన కొత్త లో లేదా.. స్నేహితులతో వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. 

36
గోవా..

చాలా మంది కలల ప్రదేశం గోవా. స్నేహితులతో ఎక్కువగా వెళ్లడానికి ఇష్టపడే ప్రదేశం ఇది.  ఇక్కడి బీచ్‌లు, వాటర్ స్పోర్ట్స్, బీచ్ పార్టీ , నైట్ లైఫ్ స్నేహితులతో ఆనందించడానికి అద్భుతంగా ఉంటుంది. మీరు మీ భార్య లేదా స్నేహితురాలితో వచ్చినట్లయితే, మీరు బీచ్‌లో సూర్యాస్తమయాన్ని చూస్తూ రొమాంటిక్ వాక్ చేస్తూ, మంచి బీచ్ రెస్టారెంట్ లో ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయవచ్చు

46
రిషికేష్-సాహసం ఆధ్యాత్మిక అనుభవం

మీకు ప్రయాణంలో కొంచెం సాహసం కావాలంటే, రిషికేష్  ఉత్తమ ప్రదేశం. ఇక్కడి రివర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్ , క్యాంపింగ్ స్నేహితులతో జీవితకాల జ్ఞాపకంగా మారవచ్చు. అదే సమయంలో, జంటలు గంగా ఘాట్‌లో సాయంత్రం ఆరతిని చూడటం , పర్వతాల మధ్య ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవించడం చాలా ప్రశాంతంగా ఉంటుంది.

56
లడఖ్-రోడ్ ట్రిప్

30-35 ఏళ్ల ముందు మీరు లడఖ్‌కు ట్రిప్ చేయకపోతే, మీరు జీవితంలో ఒక గొప్ప అనుభవాన్ని కోల్పోతారు. అది బైక్ ట్రిప్ అయినా లేదా కార్ ట్రిప్ అయినా - లేహ్, నుబ్రా వ్యాలీ, ప్యాంగోంగ్ సరస్సు , ఖర్దుంగ్ లాకు వెళ్లొచ్చు. స్నేహితులు, లైఫ్ పార్ట్నర్ తో వెళ్లినా ఎంజాయ్ చేయవచ్చు.

66
అండమాన్ నికోబార్-జంటలకు స్వర్గం

మీరు ఉష్ణమండల గమ్యస్థానాన్ని వెతుకుతున్నట్లయితే, అండమాన్ కంటే మెరుగైనది ఏమీ లేదు. ఇక్కడి హావ్‌లాక్ ద్వీపం, స్కూబా డైవింగ్ , బీచ్ అన్నీ మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. బెస్ట్ హనీమూన్ ప్లేస్ అని చెప్పొచ్చు. స్నేహితులతో వెళ్లినా ఎంజాయ్ చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories