
సీజన్ ఏదైనా సరే చర్మ సంరక్షణ రెగ్యులర్ గా ఉండాలి. లేదంటే ఎన్నో రకాల స్కిన్ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్కెట్ లోకి వచ్చిన చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటాం. కొన్నింటి వల్ల ముఖ అందం మొత్తం మాయమవుతుంది. అలాగే చర్మ రంగు కూడా మారుతుంది. అంతేకాకుండా మొటిమలు, మచ్చలు వంటి చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని తగ్గించుకునేందుకు వేలకు వేలు ఖర్చు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. అయితే కొన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించడంలో తమలపాకు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అసలు తమలపాకు మన చర్మానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి తమలపాకును ఉపయోగించొచ్చు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. తమలపాకును కొన్ని పద్దతుల్లో ఉపయోగించి మనం ముఖంమీదున్న ముచ్చలను, మొటిమలతో పాటుగా ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు.
తమలపాకులో శీతలీకరణ లక్షణాలుంటాయి. ఇవి మన చర్మాన్ని వేడి నుంచి కాపాడుతాయి. అలాగే చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. తమలపాకు మన చర్మాన్ని సూర్యరశ్మికి అయిన గాయాలను మాన్పడానికి సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి
తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ఎక్కువ రోజులు యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ ఆకును ఉపయోగించడం వల్ల అకాల వృద్ధాప్యం దరిచేరదు. ముడతలు, సన్నని గీతలు తగ్గిపోతాయి. అలాగే చర్మ నష్టాన్ని కలిగించే ఫ్రీరాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి యవ్వన మెరుపును అందిస్తాయి.
మొటిమలను తగ్గిస్తుంది
తమలపాకు మొటిమలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ముఖానికి దుమ్ము, ధూళి అంటుకుని మొటిమలు అవుతాయి. మన లైఫ్ స్టైల్ వల్ల కూడా మొటిమలు అవుతాయి. అయితే మీరు ఈ మొటిమలను తమలపాకును ఉపయోగించి తగ్గించుకోవచ్చు. ఇందుకోసం తమలపాకును శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ చేయాలి. దీన్ని వడకట్టి ముఖానికి కాటన్ ప్యాడ్ తో అప్లై చేయాలి. దీనివల్ల మీ స్కిన్ క్లియర్ గా ఉంటుంది. ముఖంమీదున్న మురికి తొలగిపోతుంది.
నల్లమచ్చలు తగ్గుతాయి
మొటిమలతో పాటుగా ఎన్నో కారణాల వల్ల ముఖంపై నల్లమచ్చలు ఏర్పడతాయి. ఈ నల్లమచ్చలను పోగొట్టేందుకు చాలా మంది మార్కెట్ ఉన్న ఎన్నో రకాల క్రీం లను వాడుతుంటారు. కానీ సమస్య ను తగ్గించుకోవడానికి మీరు తమలపాకును కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం తమలపాకు పేస్ట్ లో తేనెను కలిపి ముఖానికి పెట్టాలి. దీనివల్ల నల్ల మచ్చలు తగ్గిపోతాయి. అయితే ఈ పేస్ట్ ను ముఖానికి పెట్టడానికి ముందు కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేయాలి.
రంగును మెరుగుపరుస్తుంది
తమలపాకును ఉపయోగించి మన ముఖ రంగును కూడా మెరుగుపర్చుకోవచ్చు. ఇది మన స్కిన్ టోన్ ను పెంచుతుంది. స్కిన్ క్లియర్ గా కనిపించేందుకు సహాయపడుతుంది. ఇందుకోసం తమలపాకు పేస్ట్ ను వడకట్టండి. ఈ రసాన్ని శెనగపిండిలో కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోండి. ఇలా చేస్తే మీ ముఖం నీట్ గా ఉంటుంది.