సిమ్లా అందమైన హిల్ స్టేషన్. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం, ఆకర్షణీయమైన ప్రదేశాలు పర్యాటకులకు మంచి అనుభూతినిస్తాయి. రిడ్జ్, మాల్ రోడ్, కుఫ్రి, జఖూ ఆలయం, కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్, థియోగ్, స్కాండల్ పాయింట్, క్రైస్ట్ చర్చి, లక్కర్ బజార్, హిమాలయన్ బర్డ్ పార్క్ సిమ్లా పర్యాటకంలో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు.