జీవితం అంటేనే కష్ట సుఖాల కలయిక. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదొడుకులు ఎదురవుతుంటాయి. కానీ ఆ పరిస్థితిలో మనం ఎలా ఉన్నామనేదే ముఖ్యం. కొన్ని లైఫ్ స్కిల్స్ మన ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరికీ అవి అవసరం కూడా. మరి ఆ స్కిల్స్ ఏంటో తెలుసుకుందామా..
జీవితం సాఫీగా సాగిపోవడానికి కొన్ని స్కిల్స్ కచ్చితంగా అవసరం. ప్రస్తుత రోజుల్లో డిగ్రీలు, టెక్నాలజీ తెలిసినంత మాత్రాన జీవితం సాఫీగా సాగిపోదు. మన జీవితంలో ఎదుగుదల ఉండాలంటే.. సరిగ్గా ఆలోచించడం, బలమైన సంబంధాలు కలిగి ఉండటం, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవహరించడం వంటి లైఫ్ స్కిల్స్ తెలిసి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికీ అవసరమైన టాప్ 10 లైఫ్ స్కిల్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
25
సమస్య పరిష్కార నైపుణ్యం (Problem-Solving Skills)
ప్రతి ఒక్కరు, ప్రతి రోజూ.. ఏదో ఒక సమస్యను ఎదుర్కుంటూనే ఉంటారు. అయితే ఆ సమస్యను అర్థం చేసుకొని.. దానికి పరిష్కారాన్ని వెతకడం ముఖ్యమైన నైపుణ్యం. సమస్యను పరిష్కరించే సామర్థ్యం లేకపోతే.. ప్రతిసారి ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది.
కమ్యూనికేషన్ స్కిల్స్ (Communication Skills)
ప్రస్తుత రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమైనవి. అవగాహనతో ఉండటం, స్పష్టంగా మాట్లాడగలగడం నేర్చుకోవాలి. వ్యక్తిగత సంబంధాలు, ఉద్యోగ జీవితం, వ్యాపారాలు ఇతర విషయాల్లోనూ ఇది ఎంతో అవసరం.
నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision Making)
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఇది మన అనుభవంతో పాటు, ఆలోచనా శైలితో మెరుగవుతుంది.
35
భావోద్వేగ నియంత్రణ (Emotional Management)
కోపం, భయం, నిరాశ లాంటి భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. వాటిపై నియంత్రణ లేకపోతే.. కొన్నిసార్లు మనం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది.
పరస్పర సంబంధ నెపుణ్యత (Interpersonal Skills)
తోటివారితో బంధం ఏర్పరచుకోవడం, టీంలో పనిచేయడం, వినయంగా వ్యవహరించడం లాంటి లక్షణాలు వ్యక్తిత్వ వికాసానికి చాలా ముఖ్యం.
డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని ఎలా వినియోగించాలి.. ఎలా పొదుపు చేయాలో కూడా తెలిసి ఉండాలి. అప్పులు ఎప్పుడు తీసుకోవాలి.. ఎలా తిరిగి చెల్లించాలి వంటి విషయాలు కచ్చితంగా తెలిసి ఉండాలి. ఇది జీవితాంతం ఉపయోగపడే నైపుణ్యం.
సమయ నిర్వహణ (Time Management)
సమయాన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల ఉత్పాదకతను పెంచుకోవచ్చు. ఆలస్యం, నిర్లక్ష్యం లాంటి వ్యసనాల నుంచి దూరంగా ఉండగలుగుతాం.
ప్రాథమిక జీవన నెపుణ్యతలు (Basic Life Skills)
వంట చేయడం, బట్టలు ఉతకడం, ఇల్లు క్లీన్ గా పెట్టుకోవడం వంటి చిన్న పనులు తెలిసి ఉండటం వల్ల స్వతంత్రంగా జీవించడానికి అవకాశం ఉంటుంది.
55
స్వీయ సంరక్షణ (Self-Care and Hygiene)
శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, శుభ్రత మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. వీటిని నిర్లక్ష్యం చేస్తే జీవితం సాఫీగా సాగదు.
నిరంతర అభ్యాసం (Continuous Learning)
కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆత్రుత, మారుతున్న సమాజానికి అనుగుణంగా అప్‌డేట్ అవ్వడం వంటివి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి.