Top 10 Countries : ఆసియాలోనే అత్యంత క్వాలిటీ లైఫ్ కలిగిన 10 దేశాలు.. ఇండియా, పాకిస్థాన్ ల స్థానం ఎంత.?

Published : Jan 28, 2026, 12:26 PM IST

Quality of Life Index 2026 : ఆసియాలో అత్యంత నాణ్యమైన జీవన ప్రమాణాలు కలిగిన ప్రజలు ఏ దేశంలో ఉన్నారు..? భారత్, చైనా, పాకిస్థాన్ దేశాల ప్రజల పరిస్థితి ఎలా ఉంది… ఈ దేశాల్లో మెరుగైన స్థానం ఎవరిది? 

PREV
18
ఈ దేశాల ప్రజలదే లైఫ్ అంటే...

Quality of Life Index 2026 : ఒక దేశ అభివృద్ధిని జిడిపి, ఆర్థిక ఎదుగదల సూచిస్తాయి. కానీ ఇలా ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల్లో కూడా ప్రజా సమస్యలు అధికంగా ఉంటాయి. అధిక జనాభా, గాడితప్పిన పాలన... ఇలాంటి అనేక కారణాలతో అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ప్రజల జీవన నాణ్యత (Quality of Life) దారుణంగా ఉంది. కొన్ని దేశాలు ఆర్థికంగా కాస్త బలహీనంగా ఉన్నా అక్కడి ప్రజలు చాలా మెరుగైన జీవన ప్రమాణాలు కలిగివున్నారు.. ఏ సమస్యలు లేకుండా హాయిగా జీవించగలుగుతున్నారు.

అయితే ప్రజలు నాణ్యమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పడానికి అనేక అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. ఓ దేశంలో ప్రజలకు సంపూర్ణ భద్రత లభిస్తే, మెరుగైన ఆదాయం ఉంటే, పరిసరాలు పరిశుభ్రంగా ఉండి ఆరోగ్యకరమైన వాతవరణం ఉంటే, ఆరోగ్య సంరక్షణ కలిగివుంటే... అక్కడి వారి జీవనం మెరుగ్గా ఉన్నట్లు. ఇలా అన్ని విషయాల్లోనూ సంతృప్తిగా ఉండి హాయిగా జీవిస్తే ఆ దేశం క్వాలిటీ లైఫ్ కలిగివున్నట్లు. ఇలా ఆసియాలో క్వాలిటీ లైఫ్ కలిగిన టాప్ 10 దేశాల లిస్ట్ ను ఇటీవల నంబియో (Numbeo) సంస్థ ప్రకటించింది. ఆ దేశాలేవో ఇక్కడ తెలుసుకుందాం.

28
1. ఒమన్

ఆసియాలో అత్యంత నాణ్యమైన జీవితాన్ని ఒమన్ ప్రజలు కలిగివున్నారు. ఈ దేశ ప్రజల కొనుగోలు శక్తి అధికంగా ఉంది... ఆదాయంతో పోలిస్తే అతి తక్కువకే ఇక్కడ ఆస్తులు లభిస్తాయి. అందుకే ప్రతిఒక్కరు సొంత ఇంటిని కలిగివుంటారు. వాతావరణ కాలుష్యం కూడా చాలా తక్కువ. అయితే ఇక్కడ హెల్త్ కేర్ వ్యవస్థ కాస్త బలహీనం. అయినప్పటికీ ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఒమన్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ లో 207.6 స్కోర్ తో టాప్ లో నిలిచింది.

38
2. జపాన్

జపాన్ అనగానే మనకు ముందుకు గుర్తుకువచ్చేది టెక్నాలజీ. చాలా దేశాల్లో డెవలప్ ఎక్కువగా ఉంటే కాలుష్యం పెరిగి జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి. కానీ జపాన్ లో మాత్రం ఈ డెవలప్మెంట్ ప్రజల జీవణ ప్రమాణాన్ని దెబ్బతీయలేదు. ప్రజల భద్రత, మెరుగైన వాతావరణ పరిస్థితులు, అద్భుతమైన హెల్త్ కేర్, సూపర్ ఫాస్ట్ గ్రోత్ జపాన్ ను క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ లో 185.6 స్కోర్ తో టాప్ లో నిలిపింది.

48
3. ఖతార్

గల్ఫ్ దేశాల్లో ప్రజలకు ఆదాయం చాలా ఎక్కువ. అంతేకాదు ఇక్కడి చట్టాలు చాలా కఠినం. అందుకే ప్రజల కొనుగోలుశక్తి, భద్రత ఎక్కువ... ఖతార్ లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ కాలుష్యం ఎక్కువగా ఉండి ప్రజారోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 182.7 స్కోరుతో ఈ దేశం మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

58
4. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)

ప్రజలు నాణ్యమైన జీవన ప్రమాణాలు కలిగిన మరో దేశం యూఏఈ... ఇక్కడ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 175.5 గా ఉంది. కరెన్సీ విలువ ఎక్కువగా ఉండటంతో పాటు ప్రజల ఆదాయం కూడా ఎక్కువే... కాబట్టి కొనుగోలు శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కేర్ కూడా యూఏఈలో బాగుంటుంది. అబుదాబి, దుబాయ్ వంటి నగరాలు వరల్డ్ క్లాస్ సౌకర్యాలను కలిగివున్నాయి. అయితే ఇక్కడి ప్రాపర్టీస్ ధరలే చాలా ఎక్కువగా ఉంటాయి.

68
5. ఇజ్రాయెల్

క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 167.7 స్కోర్ తో ఇజ్రాయెల్ ఐదో స్థానంలో నిలిచింది. ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి హెల్త్ కేర్ ను ఆ దేశం కలిగివుంది. కానీ ఈ దేశంలో లివింగ్ కాస్ట్, ప్రాపర్టీ ధరలు చాలా ఎక్కువ... ప్రజల ఆదాయంతో ఇవి సరిపోవు. మిగతా విషయాల్లో ఇజ్రాయెల్ ప్రజలు సంతోషంగానే ఉన్నారు.

78
క్వాలిటీ లైఫ్ లో టాప్ 6 నుండి 10 ర్యాంకులు ఈ దేశాలవే...

ఇక క్వాలిటి లైప్ ఇండెక్స్ 2026 లో సౌదీ అరేబియా 165.3 స్కోర్ తో ఆరో స్థానంలో నిలిచింది. కువైట్ 162 స్కోర్ తో ఏడు, సైప్రస్ 159 స్కోర్ తో ఎనిమిది, సింగపూర్ 158.1 స్కోర్ తో తొమ్మిది, తైవాన్ 155 స్కోర్ తో పదో స్థానంలో నిలిచాయి.

88
క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ లో భాారత్ స్థానమెంత..?

అయితే క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ లో భారత్ 122.3 స్కోరుతో 18వ స్థానంలో నిలిచింది. మనకంటే మెరుగైన ర్యాంకులో చైనా (134.8 స్కోరుతో 14వ స్థానం) ఉంది. పాకిస్థాన్ 98.3 స్కోర్ తో 23వ స్థానంలో నిలిచింది. ఆసియన్ కంట్రీస్ లో అత్యంత తక్కువ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ కలిగిన దేశం శ్రీలంక... ఈ దేశం స్కోరు కేవలం 61 మాత్రమే.

Read more Photos on
click me!

Recommended Stories