1.ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ ద్వారా విక్రయించడం..
పాత దుస్తులను అమ్మడానికి ఈ రోజుల్లో చాలా వెబ్ సైట్లు, యాప్ లు చాలా అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఎలా పడితే అలా వాటిని అమ్మలేం. ఆ దుస్తులను ముందుగా శుభ్రం చేయాలి. వాటిని నీట్ గా ఐరన్ చేసి.. ఆపై ఫోటోలు తీయాలి. మంచి వెలుతురులో తీసిన ఫోటోలు, బ్రాండ్ వివరాలు కచ్చితంగా ఇస్తే..కస్టమర్లు త్వరగా కొనుగోలు చేసే అవకాశం ఉంది.ఈ దుస్తులను కొనుగోలు చేయడానికి చాలా ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి.
మన దేశంలో FreeUp, Poshmark, Meesho లేదా OLX వంటి ప్లాట్‌ఫామ్స్‌లో వీటిని అమ్మవచ్చు.
2. ఇన్‌స్టాగ్రామ్ త్రిఫ్ట్ స్టోర్స్ (Instagram Thrift Stores)
ప్రస్తుత యువత 'వింటేజ్' (Vintage), విభిన్నమైన దుస్తులను ధరించడానికి ఇష్టపడుతున్నారు. మీ దగ్గర ఉన్న మంచి క్వాలిటీ దుస్తులను స్టైలిష్‌గా ఫోటోలు తీసి ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీని ప్రారంభించండి. మీ స్నేహితుల పాత దుస్తులను కూడా అందులో పెట్టి అమ్మవచ్చు. కొన్ని నగరాల్లో పాత దుస్తులను తీసుకుని మనకు కమిషన్ ఇచ్చే 'త్రిఫ్ట్ షాపులు' కూడా ఉంటాయి.