అల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అల్లంలో యాంటీఆక్సిడెంట్ గుణాలు అధికం. ఇందులో ఉండే జింజెరాల్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనితో తయారుచేసే అల్లం టీ పరగడుపున ఖాళీపొట్టతో తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
చలికాలంలో చాలా మంది అల్లం టీని తాగేందుకు ఇష్టపడతారు. ఇది శరీరంలో సహజంగా వేడి పెంచుతుంది. అల్లంలో ఉండే 'జింజరోల్' అనే సహజ రసాయనం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరం చల్లగా అనిపించినప్పుడు అల్లం టీ తాగితే వెంటనే వేడి ఏర్పడి అసౌకర్యం తగ్గుతుంది. అందుకే జలుబు, దగ్గు వచ్చినప్పుడు కూడా అల్లం టీ ఎక్కువగా సిఫారసు చేస్తారు. అయితే ఖాళీ పొట్టతో అల్లం టీ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
25
జీర్ణక్రియ
అల్లంటీ ఖాళీ పొట్టతో తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి వల్ల కలిగే కడుపునొప్పి, వికారం, వాంతులు, గ్యాస్, మలబద్ధకం వంటివి రాకుండా ఇది అడ్డుకుంటుంది. ఉదయాన్నే పరగడుపున అల్లం టీ తాగితే ఈ సమస్యలేవీ రావు. నాలుగు రోజులు తాగితే చాలు మీకు దీని ప్రభావం తెలుస్తుంది.
35
రోగనిరోధక శక్తి
చలికాలంలో చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వాటిని ఎదుర్కొవడానికి శరీరానికి రోగ నిరోధక శక్తి అవసరం. అల్లం లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి ఇమ్యూనిటీని బలపరుస్తాయి. వాతావరణంలో మార్పులు వచ్చిన ప్రతిసారి జలుబు పట్టే వారిలో అల్లం టీ చాలా ఉపయోగకరం.
ప్రయాణాల సమయంలో కొందరికి ఉబ్బసం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అల్లం టీ తాగడం ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం కడుపును ప్రశాంతంగా ఉంచి, వాంతులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. ప్రత్యేకంగా మహిళల్లో వాంతులు తగ్గేందుకు కూడా అల్లం సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
55
పొట్ట కొవ్వును కరిగించడానికి
అల్లం టీ తాగడం జీవక్రియను పెంచుతుంది. కేలరీలను బర్న్ చేస్తుంది, పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని అల్లం టీ తాగితే బరువు తగ్గడంలో కొంత సహాయం అవుతుంది. పైగా ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం వల్ల పొట్ట బిగువుగా అనిపించే సమస్యలు తగ్గుతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి కూడా అల్లం టీ తాగడం మంచిది. రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడానికి అల్లం టీ తాగడం మంచిది. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.