Fenugreek Water: మెంతినీళ్లు రెండు వారాలు ప్రతిరోజూ తాగితే.. ఈ సమస్య పూర్తిగా పోతుంది

Published : Dec 05, 2025, 02:06 PM IST

Fenugreek Water: మెంతులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో సపోనిన్లు, ఫినాలిక్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించి, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే మెంతినీరు బరువు తగ్గేందుకు ఎంతో సాయపడుతుంది.

PREV
16
మెంతినీరు ఎంత మంచిదో తెలుసా?

మెంతులను ఆయుర్వేదంలో 'ఆరోగ్య నిధి'గా పిలుస్తారు.  ఈ గింజల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ గింజల్లో ఫైబర్, ఐరన్, విటమిన్ బి6, యాంటీఆక్సిడెంట్లు లాంటి పోషకాలున్నాయి. ఇవి శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ ను తగ్గించి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. మీరు రెండు వారాల పాటూ ప్రతిరోజూ మెంతి నీరు తాగి చూడండి డయాబెటిస్ పూర్తిగా అదుపులోకి వచ్చేస్తుంది.

26
మెంతుల నీటిని ఎలా తయారు చేయాలి?

మెంతులను నీటిలో నానబెడితే పోషకాలు నీటిలో కరుగుతాయి. గ్లాసు నీటిలో 2-3 స్పూన్ల మెంతులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి. వీటి రుచి చేదుగా అనిపిస్తే  నిమ్మరసం, తేనె వంటివి కలుపుకుని తాగవచ్చు. 

36
కచ్చితంగా బరువు తగ్గుతారు

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారు మెంతలు నీటిని ప్రతిరోజూ తాగాలి. ఇందులో ఉండే ఫైబర్ వల్ల ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. ఆకలిని చాలా వరకు తగిస్తుంది. దీని వల్ల మీకు ఆటోమేటిక్ గా బరువు తగ్గడానికి సాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజూ మెంతి నీరు తాగండి.

46
జీర్ణక్రియకు మంచిది

జీర్ణ సమస్యలు ఉన్నవారికి మెంతుల నీరు మంచిది. మెంతులలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు సాయపడుతుంది. ఇది జీర్ణక్రియను బలపరుస్తుంది. మలబద్ధకం, అసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు ఉన్నవారు మెంతి నీరు తాగితే పైన చెప్పిన సమస్యలను దూరం చేస్తుంది.

56
రక్తంలో చక్కెర స్థాయిలు

మెంతి నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.  ఇందులో ఉండే గెలాక్టోమన్నన్ అనే సమ్మేళనం మధుమేహ రోగులకు చాలా మేలు చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా మెంతినీరు తాగడం అలవాటు చేసుకోవాలి.

66
చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది

మెంతుల నీరు తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఈ  నీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండెను ఆరోగ్యంగా  ఉండేలా కాపాడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories