- నానబెట్టిన మినపప్పును మిక్సీ జార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోండి. రుబ్బేటప్పుడు అవసరమైతేనే కొద్దిగా నీళ్లు పోయండి.
- ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, కరివేపాకు వేసి బాగా కలపండి.
- వడలు క్రిస్పీగా రావడానికి ఇందులో రెండు స్పూన్ల బియ్యం పిండి. బయట అమ్మేవారు కూడా ఇలాగే చేస్తారు. క్రిస్పీ గారెల వెనుకున్న సీక్రెట్ ఇదే.
4. ఇప్పుడు దంచిన మిరియాలు, తగినంత ఉప్పు వేసి అంతా బాగా మిక్స్ చేయండి. ఈ పిండిని కనీసం 10 నిమిషాల పాటు చేత్తో బాగా గిలక్కొట్టాలి.
5. ఇలా చేయడం వల్ల పిండిలోకి గాలి చేరి, వడలు బాగా ఉబ్బుతాయి. ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోండి. రెండు చేతులకు కొద్దిగా నీళ్లు రాసుకోండి.
6. కొద్దిగా పిండిని తీసుకుని ముద్దలా చేసి, బొటనవేలితో మధ్యలో చిల్లు పెట్టి కాగుతున్న నూనెలో వేసి వేయించండి.
7. గారెలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాక తీసి టిష్యూ పేపర్ మీద వేయండి. అంతే క్రిస్పీ గారెలు సిద్ధమైనట్టే.